Former TV9 CEO Ravi Prakash : టీవీ9 లో రవి ప్రకాష్ కు ఇంకా వాటా… అసలు విషయం ఏంటంటే!
Former TV9 CEO Ravi Prakash : తెలుగు న్యూస్ చానల్స్ రంగంలో టీవీ9 సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే టీవీ 9 నెంబర్ 1 న్యూస్ ఛానల్ గా నిలవడంలో సీఈవో రవి ప్రకాష్ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాడు. తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో ఆయన సఫలమయ్యాడు. దేశంలోనే నెంబర్ 1 గా టీవీ9 ని నిలపడంలో రవి ప్రకాష్ కృషి ఖచ్చితంగా ఉంది. సీఈవో అయినా కూడా ప్రత్యేకంగా న్యూస్ ప్రజెంటర్ గా రావడం.. ఒక న్యూస్ యాంకర్ గా వ్యవహరించడం ఆయనకే చెల్లింది.
జర్నలిస్టుగా కెరియర్ ని ప్రారంభించిన రవి ప్రకాష్ తక్కువ సమయంలోనే టీవీ9 ని ఏర్పాటు చేయడం జరిగింది. టీవీ9 ఏర్పాటు చేసిన సమయంలో 10 శాతం వాటాతో రవి ప్రకాష్ భాగస్వామి అయ్యాడు. కొన్ని కారణాల వల్ల టీవీ9 నుండి రవి ప్రకాష్ ని తప్పించారు. కానీ ఆయన షేర్ మాత్రం అలాగే కొనసాగుతోంది. టీవీ9 సీఈవోగా ఆయనను తప్పించినా కూడా ఇటీవల ఆయనకు టీవీ9లో షేర్ కొనసాగుతుందని వెళ్లడైంది. తన ఆడిటర్ తో కలిసి టీవీ9 ఆఫీస్ కి వెళ్లి మరి తన యొక్క లావాదేవీలకు సంబంధించిన అకౌంట్స్ ను ఆడిట్ చేయించాడు.
తాజాగా సోషల్ మీడియాలో టీవీ9 ఆఫీసులో రవి ప్రకాష్ అంటూ పెద్ద ఎత్తున హడావిడి జరిగింది. రవి ప్రకాష్ వార్తల్లో నిలవడం కొత్త ఏం కాదు.. ఈ మధ్య కాలంలో ఆయన టీవీ9 కి పోటీగా ఆర్ టీవీ ఛానల్ ని తీసుకొస్తున్నాడు. ఆ ఛానల్ కి సంబంధించిన ప్రసారాలు ఆసక్తిగా ఉంటున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి టీవీ9 లో తనకు పది శాతం వాటా ఉన్న కూడా ఆ ఛానల్ పై ఆధిపత్యానికి రవి ప్రకాష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
రవి ప్రకాష్ రాజకీయాల కారణంగా టీవీ9 నుండి తప్పించబడ్డాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. టీవీ9 నుండి రవి ప్రకాష్ వెళ్ళి పోయిన తర్వాత నెంబర్ వన్ స్థానం నుండి టీవీ9 నెంబర్ 2కి పడిపోయిందని ఆరోపణలు కూడా వస్తున్నాయి. మళ్లీ రవి ప్రకాష్ టీవీ 9 లో అడుగు పెట్టాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే టీవీ9 లో రవి ప్రకాష్ పది శాతం వాటా ఉందని క్లారిటీ వచ్చింది.