Former TV9 CEO Ravi Prakash : రవిప్రకాష్ కొత్త న్యూస్ ఛానల్‌ వచ్చేసింది.. టీవీ9 ని ఢీ కొట్టడం టార్గెట్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Former TV9 CEO Ravi Prakash : రవిప్రకాష్ కొత్త న్యూస్ ఛానల్‌ వచ్చేసింది.. టీవీ9 ని ఢీ కొట్టడం టార్గెట్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :18 February 2023,2:00 pm

Former TV9 CEO Ravi Prakash : ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు అందుబాటులో ఎన్నో న్యూస్ చానల్స్ ఉన్నాయి. అయితే న్యూస్ చానల్స్ ఎన్ని ఉన్నా కూడా టీవీ9 కి చాలా ప్రత్యేకత ఉంటుంది. తెలుగులో తొలి 24 గంటల న్యూస్ ఛానల్ గా టీవీ9 గుర్తింపు దక్కించుకుంది. రవి ప్రకాష్ ఈ ఛానల్ ని ప్రారంభించాడు. సీనియర్ జర్నలిస్ట్ అయిన రవి ప్రకాష్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు వార్తలను కొత్తగా చూపించి మంచి రేటింగ్ సొంతం చేసుకున్నాడు. టీవీ9 ప్రారంభించిన అతి తక్కువ రోజుల్లోనే ఎంటర్టైన్మెంట్ చానల్స్ ని మించి రేటింగ్ నమోదు చేసింది. ఒకానొక సమయంలో జాతీయ స్థాయిలో కూడా టీవీ9 నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

Former TV9 CEO Ravi Prakash started new news channel name R TV news

Former TV9 CEO Ravi Prakash started new news channel name R TV news

ఆ కారణంగానే ఇతర భాషల్లో కూడా టీవీ9 నెట్వర్క్ క్రియేట్ అయింది. రాజకీయ కారణాలు మరియు ఇతర కారణాల వల్ల టీవీ9 నుండి రవి ప్రకాష్ దూరమయ్యాడు. తను పెంచి పోషించిన టీవీ9 సంస్థ నుండి తనను తప్పించడం పట్ల రవి ప్రకాష్ కొన్నాళ్లు న్యాయ పోరాటం చేశాడు. కానీ ఆయన న్యాయ పోరాటంలో సఫలం కాలేక పోయాడు. టీవీ9 మళ్లీ తన చేతికి రాదని నిర్ణయించుకొని కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆర్ టివి అంటూ కొత్త ఛానల్ ని రవి ప్రకాష్ తన పేరుతోనే ప్రారంభించాడు. ఆర్ అంటే రవి ప్రకాష్ అనే విషయం తెలిసింది, ఇప్పటికే ఈ ఛానల్ యొక్క కార్యక్రమాలు మొదలయ్యాయి. అతి త్వరలోనే శాటిలైట్ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయి.

Former TV9 CEO Ravi Prakash started new news channel name R TV news

Former TV9 CEO Ravi Prakash started new news channel name R TV news

ఆర్ టివి కచ్చితంగా టీవీ9 యొక్క రేటింగ్ ని దెబ్బ కొట్టి ఆ ఛానల్ పై ఆధిపత్యాన్ని ప్రదర్శించబోతుందని రవి ప్రకాష్ చాలా ధీమాతో ఉన్నాడట. ఇప్పటికే ఆర్ టీవీ లోకి గతంలో టీవీ9 లో పని చేసిన వారిని కొంత మందిని రవి ప్రకాష్ ఆహ్వానించడం జరిగింది. ఒకటి రెండు నెలల్లోనే ఆర్ టివి కచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని రవి ప్రకాష్ సన్నిహితుల వద్ద చాలా నమ్మకంగా చెబుతున్నాడట. మొత్తానికి రవి ప్రకాష్ పట్టుదలతో ఆర్ టివిని స్థాపించి టీవీ9పై పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయి అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది