
Four hotel style Chicken Recipes for chicken lovers
Chicken Recipes : చికెన్ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చికెన్ ప్రియుల కోసం ఇప్పుడు మనం ఒక నాలుగు రకాల రెసిపీస్ తయారు చేసుకుందాం. 1 – గోంగూర చికెన్ : దీనికి కావలసిన పదార్థాలు : చికెన్ గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు ,కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉల్లిగడ్డలు కొత్తిమీర, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఆయిల్, కరివేపాకు మొదలైనవి… దీని తయారీ విధానం : ముందుగా అరకేజీ చికెన్ తీసుకుని దాన్లో ఒక స్పూను ఉప్పు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియా పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక రెండు స్పూన్లు ఆయిల్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు, అర కప్పు టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన ఒక కట్ట గోంగూర తీసుకొని దానిలో నాలుగు పచ్చిమిర్చి వేసి ఉడికించుకొని దానిని మిక్సీ వేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ని అదే బౌల్ తోని స్టవ్ పైన పెట్టి 15 నిమిషాల పాటు ఈగనివ్వాలి. ఆయిల్ బయటికి వచ్చేవరకు వేయించుకొని తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూరను దాంట్లో వేసి బాగా కలుపుకొని తర్వాత ఒక గ్లాసు నీటిని వేసి దగ్గరకయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆపి సర్వింగ్ అంతే గోంగూర చికెన్ రెడీ.
2 – చికెన్ వేపుడు : ముందుగా ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ ని వేసి, దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ వేసుకోవాలి. అలాగే దానిలోనే పెద్ద సైజు గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే అరకప్పు టమాట ముక్కలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పది నేను పదిహేను నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో రెండు లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జిలకర, రెండు స్పూన్ల కారం, దాంట్లో ఒక 10 ఎల్లుల్లి గర్భాలు ఏసి బాగా మెత్తగా పట్టుకొని దానిలో వాటర్ వేసి పేస్టులా చేసుకోని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న చికెన్ బాగా ఆయిల్ బయటికి వచ్చేవరకు ఉడికించుకొని దాంట్లో ఈ మిక్సీలో వేసుకున్న ఎల్లుల్లి కారం పేస్టును ని దాంట్లో వేసి బాగా కలిపి మూత పెట్టి పది పదిహేను నిమిషాల వరకు అలాగే ఎగనివ్వాలి. ఇక చివరిలో కొంచెం కరివేపాకు చల్లుకొని, కొంచెం నిమ్మరసం జల్లుకొని ఇక దింపే ముందు కొత్తిమీర జల్లుకొని దింపుకోవాలి. అంతే ఎల్లుల్లి చికెన్ వేపుడు రెడీ.
Four hotel style Chicken Recipes for chicken lovers
3 – చికెన్ షేర్వ : దీనికోసం ముందుగా చికెన్ తీసుకొని దాన్లో ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్ల కొబ్బరి పొడి, ఒక కప్పు ఉల్లిపాయలు, అరకప్పు టమాటా ముక్కలు వేసి బాగా మెత్తని పేస్టులా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని, దాంట్లో కొంచెం సాజీరా, రెండు యాలకులు, రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, నాలుగు పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం మిరియాలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి దాంట్లో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ పసుపు, ధనియాల పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ వేసి బాగా కలుపుకొని తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని దాంట్లో వేసి బాగా కలుపుకోని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఏగిన తర్వాత ఒక లీటర్ నీళ్లను పోసి దాన్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అంతే చికెన్ షేర్వ రెడీ.
4 – చికెన్ కర్రీ : ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి, దాంట్లో నాలుగు లవంగాలు, ఒక జాపత్రి, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, రాతి పువ్వు అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు, తర్వాత ఒక పెద్ద కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటూ తర్వాత ముందుగా పసుపు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ దీంట్లో వేయాలి. వేసి బాగా ఎర్రగా వేగే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ బాగా వేగనివ్వాలి. తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి. తర్వాత దానిలో ఒక గ్లాసున్నర వాటర్ని పోసి బాగా కలిపి మూత పెట్టి వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని అలా ఉడికించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకొని దింపుకోవాలి అంతే చికెన్ కర్రీ రెడీ.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.