Supraja Hospital : గౌడన్నలకు అండగా సుప్రజ హాస్పిటల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Supraja Hospital : గౌడన్నలకు అండగా సుప్రజ హాస్పిటల్

 Authored By prabhas | The Telugu News | Updated on :2 May 2023,9:00 am

– కల్లు గీస్తూ గాయపడితే ఉచిత వైద్యం
– ఇప్పటి వరకు 20 మందికి పైగా గీత కార్మికులకు ఉచిత వైద్యం
– రూపాయి తీసుకోకుండా తీవ్రగాయాలైన గీత కార్మికులకు 60 ల‌క్ష‌ల పైగా ఖరీదైన వైద్యం
– సుప్రజ ఆసుపత్రి ఎండీ శిఖ విజయ్ కుమార్ గౌడ్ ఔదార్యం

Supraja Hospital గౌడన్నలకు అండగా సుప్రజ హాస్పిటల్

free treatment for Gouds supraja hospital md vijay kumar goud

ఈరోజుల్లో జ్వరం వస్తేనే చికిత్స కోసం వేలు ఖర్చు పెట్టాలి. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్లినా.. ఇంటి పక్కన ఉన్న ఆసుపత్రికి వెళ్లినా బిల్లు మాత్రం వెయ్యికి తగ్గదు. వైద్యం అంటేనే బిజినెస్, వైద్యం చేయించుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే అభిప్రాయం ఉన్న ఈ జనరేషన్ లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా రూపాయి తీసుకోకుండా గౌడన్నలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తోంది హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న సుప్రజ హాస్పిటల్.

కల్లు గీస్తూ గాయపడితే ఉచిత వైద్యం

free treatment for Gouds supraja hospital md vijay kumar goud

గీత కార్మికులది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ల వృత్తి కత్తి మీద సాము లాంటిది. గీత కార్మికుల బాధ మరొక గీత కార్మికుడికి, లేదంటే గౌడన్నకే తెలుస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టి చెట్టు ఎక్కి తీయని కల్లును గీసి మనకు అందిస్తారు. ప్రాణాలకు తెగించి వాళ్లు రోజంతా కష్టపడితే వచ్చేది మూడు పూటల తిండికే సరిపోదు. ఇక.. చెట్టు ఎక్కి ఏదైనా ప్రమాదానికి లోనైతే, గాయాల పాలు అయితే ఎవరు ఆదుకుంటారు. ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు ఖర్చు ఎవరు పెడతారు? చెట్టు నుంచి కింద పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుంటే ఇక ఆ గౌడన్న పరిస్థితి అంతేనా? మంచానికి పరిమితం కావాల్సిందేనా? గీత కార్మికులను ఎవరు ఆదుకోవాలి? అలాంటి ప్రశ్నల నుంచి వచ్చిన సమాధానమే సుప్రజ ఆసుపత్రి ఎండీ శిఖ విజయ్ కుమార్ గౌడ్.

రూపాయి తీసుకోకుండా తీవ్రగాయాలైన గీత కార్మికులకు 60 ల‌క్ష‌ల పైగా ఖరీదైన వైద్యం

రూపాయి తీసుకోకుండా తీవ్రగాయాలైన గీత కార్మికులకు 60 ల‌క్ష‌ల పైగా ఖరీదైన వైద్యం

గీత కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి విజయ్ కుమార్ గౌడ్. అందుకే తన ఆసుపత్రిలో గీత కార్మికులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. రూపాయి తీసుకోకుండా తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు కింద పడి కాళ్లు, చేతులు విరిగిపోయిన చాలామంది గౌడన్నలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. ఉచితంగా సర్జరీలు చేస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన కల్లు గీత కార్మికుల మూడో మహాసభ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా తాడి చెట్టు మీది నుంచి కింద పడి గాయపడే గీత కార్మికులకు తన ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తా అని సుప్రజ ఆసుపత్రి ఎండీ విజయ్ కుమార్ గౌడ్ మాటిచ్చారు.

ఇప్పటి వరకు 20 మందికి పైగా గీత కార్మికులకు ఉచిత వైద్యం

free treatment for Gouds supraja hospital md vijay kumar goud

ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు 20 మందికి పైగా గీత కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించారని.. దాదాపు రూ.60 లక్షల విలువైన వైద్యాన్ని వాళ్లకు ఉచితంగా అందించి గీత కార్మికులకు అండగా నిలిచారని రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు గౌడ్, ఎండీ విజయ్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో AR Digital Media ఎండీ తండు రాము గౌడ్ పాల్గొని ఎండీ విజయ్ కుమార్ గౌడ్ కి, ఆసుపత్రి సిబ్బందికి ప్ర‌త్యేక‌ ధన్యవాదాలు తెలిపారు.

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన తండు జానయ్య గౌడ్ అనే గీత కార్మికుడు ఇటీవల తాడి చెట్లు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు పట్టు తప్పి కింద పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఎడ‌మ చేయి, ఎడ‌మ కాలు విరిగింది, వెన్నుముక ఎముకలు 7 విరిగాయి. కాళ్లు, చేతులకూ తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు తెలిసిన వారిని అడిగి ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలుసుకొని వెంటనే నాగోల్ లో ఉన్న సుప్రజ ఆసుపత్రికి తరలించారు. రూపాయి కూడా తీసుకోకుండా ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని జానయ్యకు ఉచితంగా అందించారు. ప్రస్తుతం జానయ్య కొలుకొని నిలకడగా ఉన్నాడు. జానయ్య ప్రాణాలు కాపాడి.. ఉచితంగా వైద్యం అందించినందుకు ఆయన కుటుంబ సభ్యులు సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం, ఎండీ శిఖ విజయ్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపారు.

సుప్రజ ఆసుపత్రి ఎండీ శిఖ విజయ్ కుమార్ గౌడ్ ఔదార్యం

సుప్రజ ఆసుపత్రి ఎండీ శిఖ విజయ్ కుమార్ గౌడ్ ఔదార్యం

అలాగే మ‌రో గీత కార్మికుడు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం షాపురం గ్రామానికి చెందిన నరేందర్ గౌడ్ ఇటీవల తాటి చెట్టు ఎక్కి పట్టు తప్పి కింద పడ్డాడు. దీంతో తన కాళ్లు, చేతులు, ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు విరిగింది. వెంటనే సుప్రజ ఆసుపత్రికి తరలించడంతో ఉచితంగా వైద్యం అందించి ఆయన ప్రాణాలు కాపాడారు. దీంతో సుప్రజ ఆసుపత్రి యాజమాన్యానికి, ఎండీ శిఖ‌ విజయ్ కుమార్ కి నరేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది