Dog : నెలకి ఎనిమిది కోట్లు సంపాదిస్తున్న కుక్క పూర్తి వివరాలు..!!

Advertisement

Dog : ప్రస్తుత ప్రపంచంలో ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో జనాలు బతుకుతున్నారు. రాత్రికి రాత్రే కంపెనీలు లేపేస్తున్నారు. చెప్పా పెట్టకుండా ఉద్యోగాల నుండి.. తొలగించేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో తాజాగా ఓ కుక్క ఏకంగా నెలకు ఎనిమిది కోట్లు సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంది. కుక్కలు ఏంటి..?

కోట్లు సంపాదించడం ఏంటి అనుకుంటున్నారా..?.. పూర్తి వివరాల్లోకెళ్తే టక్కర్ అనే కుక్క తన యజమాని చెప్పినట్టు ఏ పనైనా చేస్తది. దీంతో దాని యజమాని టక్కర్ కి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. 7 జూన్ 2018 లో టక్కర్ మొదటి వీడియో వైరల్ అయింది. అప్పుడు దాని వయసు కేవలం 6 నెలలు మాత్రమే. డాగ్ లవర్స్ దాని క్యూట్ వీడియోలను బాగా ఇష్టపడ్డారు. దీంతో టక్కర్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Advertisement
full details of the dog earning eight crores per month
full details of the dog earning eight crores per month

టక్కరి పేరుతో ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ కి మూడు మిలియన్ల మంది ఫాలోవర్ లు ఉన్నారు. ఫేస్బుక్ లో నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఇదే సమయంలో టక్కర్ యూట్యూబ్ లో 50 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండటం జరిగింది. మొత్తం మీద ఈ టక్కర్ కుక్కల తరపున సోషల్ మీడియా ఎకౌంట్ల ద్వారా యజమాని నెలకు రెండు కోట్ల సంపాదన వెనకేసుకొస్తున్నారట.

 

Advertisement
Advertisement