AP MLC Election Results : ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఫుల్ డీటెయిల్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP MLC Election Results : ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఫుల్ డీటెయిల్స్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :23 March 2023,7:30 pm

AP MLC Election Results : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ టైం స్టార్ట్ అయినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు అనూహ్యమైన విజయాలు సాధించడం జరిగింది. వైసీపీ స్ట్రాంగ్ గా ఉండే రాయలసీమ ప్రాంతంలో కూడా టీడీపీ గెలవడం జరిగింది. దీంతో పట్టాభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను చంద్రబాబు ప్రత్యేకంగా సత్కరించారు. నారా లోకేష్ కూడా అభినందించడం జరిగింది. అయితే జరిగిన ఈ ఎమ్మెల్సీ

Full details of who got how many votes in the MLC election held in MLA Kota

Full details of who got how many votes in the MLC election held in MLA Kota

ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం టీడీపీ వశమైంది. ఇక వైసీపీ నుండి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్ని ఓట్లు సాధించారో లెక్క చూస్తే… మర్రి రాజశేఖర్ 22, సూర్యనారాయణ రాజు 22, జయ మంగళ వెంకటరమణ 21, కోలా గురువులు 21, బొమ్మి ఇజ్రాయిల్ 22, పోతుల సునీత 22, యేసు రత్నం 22 ఓట్లు రాబట్టడం జరిగింది. రహస్య ఓటింగ్ నేపథ్యంలో వైసీపీ క్రాస్ ఓటింగ్ కారణంగానే

టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు జరిగిన ఈ ఎన్నికల ఓటింగ్ లో 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు… టీడీపీకి ఓట్లు వేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవడంతో… ఇది ముమ్మాటికి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని టీడీపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది