Health Tips | రోజంతా కుర్చీలో కూర్చోవడం సుఖం కాదు, ప్రమాదం .. పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది..!
Health Tips | కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం, దీర్ఘకాలంలో అనారోగ్యానికి కారణమవుతున్నాయనే విషయం తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది. ముఖ్యంగా ఇది పేగు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సెంథిల్ గణేషన్ చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ లో సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు. ఆయన పేర్కొన్న విషయాల ప్రకారం, రోజుకు గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ నెమ్మదించబడుతుంది. దీనివల్ల పేగుల కదలికలు మందగించడంతో ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు, ఇంకా ముఖ్యంగా పేగుల్లో మంట పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు.
#image_title
శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా కొనసాగాలంటే “పెరిస్టాల్సిస్” అనే పేగు కదలికలు తప్పనిసరి. అయితే, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఈ కదలిక మందగిస్తుంది. ఈ స్థితిని ‘స్తబ్దత’ అని పిలుస్తారు.అధిక కొవ్వు, అధిక కేలరీలతో కూడిన ఆహారం తిన్న తరువాత కూర్చోవడం పేగు ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టుతుంది.
పేగు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పాటించాల్సిన ముఖ్య సూచనలు:
ప్రతి 45 నిమిషాలకు ఒక్కసారి లేచి నడవండి, చిన్న పనులు చేయండి.
రోజులో కనీసం 30 నిమిషాల వ్యాయామం తప్పనిసరిగా చేయండి.
అధిక ఫైబర్, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
ఎక్కువ నీరు త్రాగండి,ఇది పేగుల కదలికలకు సహకరిస్తుంది.
లంచ్ తరువాత తక్షణమే కూర్చోకుండా కొద్దిసేపు నడవండి.