Pan card : పాన్ కార్డు కావాలా? ఇలా చేస్తే కేవలం పది నిమిషాల్లోనే..

Authored By mallesh | The Telugu News | Published on: January 23, 2022, 11:30 am

Pan card : ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు మొదలు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ బ్యాంక్‌లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ కార్డు తప్పనిసరి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాన్ కార్డు లేకుండా ఆర్థిక లావాదేవీలు జరగడం సాధ్యం కాదనే చెప్పాలి. గతంలో పాన్ కార్డు పొందాలంటే రోజుల తరబడి, నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేంది. దీని కోసం అప్లై చేయగానే అంది అఫ్రూవల్ అయి పోస్టులో మన దగ్గరికి వచ్చే సరికి దాదాపు నెలకు పైగానే టైం పట్టేది. కానీ ప్రస్తుతం పాన్ కార్డును ఎక్కువ రిస్క్ లేకుండా కేవలం పది నిమిషాల్లోనే పొందవచ్చు. ఈ విషయం మీకు తెలుసా..? మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

పాన్ కార్డు కోసం https://www.incometaxindiaefiling.gov.in/ అనే వెబ్‌సైట్‌ ఒపెన్ చెయ్యాలి. ఆ తర్వాత అందులో ఇన్ స్టాంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం లెఫ్ట్ సైడ్‌లో కొత్త పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడున్న గెట్ న్యూ పాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. అనంతరం ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. కింద కాప్చాను ఎంటర్ చేయగానే మీ రిజిస్టర్ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.

get a pan card in 10 minutes like this

get a pan card in 10 minutes like this

Pan card : ఆన్‌లైన్ లోనే అప్లికేషన్..

ఓటీపీని ఎంట్ చేయాలి. పాన్ కార్డు అప్లికేషన్ కోసం ఈమెయిల్ ను కన్ఫామ్ చేయండి. అంతే సింపుల్ పది నిమిషాల్లో పాన్ కార్డు వచ్చేస్తుంది. ఇక దీనిని పీడీఎఫ్ ఫార్మట్‌లోనూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందుకు కేవలం రూ.50 మాత్రమే ఖర్చవుతుంది. చాలా సింపుల్ గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం.. పాన్ కార్డు లేని వారికి ఈ విషయం చెప్పి వారికి సహాయం చేయండి.

mallesh

No bio available for this author.

  1. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  2. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  3. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  4. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  5. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  6. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  7. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp