Central Government : ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కేంద్రం రూ. 2 లక్షల నుండి కోటి రూపాయల సాయం.. ఇందుకోసం ఎంచేయాలంటే !!
Central Government : మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక అవకాశాలను కల్పిస్తోంది. మహిళలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రోత్సాహకంగా స్టాండప్ ఇండియా అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ఆధార్ కార్డు కలిగిన ప్రతి మహిళకు రూ.2 లక్షల నుండి రూ.1 కోటి వరకు లోన్ పొందే అవకాశం ఉంది. ఈ రుణాన్ని తీసుకున్నవారు 7 సంవత్సరాల కాలంలో ఈఎంఐ ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు తమ స్వయం ఉపాధికి అనుకూలంగా రూపొందించబడింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న మరియు మధ్య తరగతి కుటుంబాలు దీనివల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, KYC పత్రాలు, మరియు వ్యాపార ప్రణాళిక అవసరం. 18 ఏళ్లు నిండిన మహిళలు ఈ పథకానికి అర్హులు. వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలు తమ ప్రణాళికను సిద్ధంగా ఉంచుకుని బ్యాంకుల ద్వారా ఈ లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు.
Central Government : ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కేంద్రం రూ. 2 లక్షల నుండి కోటి రూపాయల సాయం.. ఇందుకోసం ఎంచేయాలంటే !!
స్టాండప్ ఇండియా పథకం ద్వారా బ్యూటీ పార్లర్, బోటిక్, బేకరీ, ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ సేవలు, ఆటోమొబైల్ రిపేరింగ్, కన్సల్టెన్సీ సంస్థలు వంటి అనేక రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఈ రుణంలో 75% బ్యాంకు నిధులు కాగా, మిగిలిన 25% సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీ రేటుతో, సుదీర్ఘ పుణ్యకాలంతో ఈ లోన్ repay చేయొచ్చు. మహిళలు ఆర్థికంగా స్వావలంబిగా మారేందుకు ఇది మంచి అవకాశంగా మారుతోంది.