Non Veg Goat : ముక్క లేకుంటే ముద్ద దిగదు.. చికెన్ బిర్యానీ తినే మేకను ఎక్కడైనా చూశారా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Non Veg Goat : ముక్క లేకుంటే ముద్ద దిగదు.. చికెన్ బిర్యానీ తినే మేకను ఎక్కడైనా చూశారా?

Non Veg Goat : సాధారణంగా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు గట్రా ఎవరు తింటారు. మామూలు మనుషులు కానీ.. జంతువులు తినవు కదా. నిజానికి ఆ జంతువులను బలి ఇచ్చే కదా మనం చికెన్, మటన్ లు వండుకొని తినేది. కానీ.. ఓ మేక మాత్రం వెరైటీగా చికెన్ బిర్యానీ తింటోంది. ప్రస్తుతం ఆ మేక చికెన్ బిర్యానీ తినే ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి మేకలు చెట్ల ఆకులను, మొక్కలను […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 December 2021,8:00 pm

Non Veg Goat : సాధారణంగా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు గట్రా ఎవరు తింటారు. మామూలు మనుషులు కానీ.. జంతువులు తినవు కదా. నిజానికి ఆ జంతువులను బలి ఇచ్చే కదా మనం చికెన్, మటన్ లు వండుకొని తినేది. కానీ.. ఓ మేక మాత్రం వెరైటీగా చికెన్ బిర్యానీ తింటోంది. ప్రస్తుతం ఆ మేక చికెన్ బిర్యానీ తినే ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

నిజానికి మేకలు చెట్ల ఆకులను, మొక్కలను తిని బతుకుతాయి. కానీ.. ఈ మేక మాత్రం.. ఆకులు తినదు.. మొక్కలను తినదు. చికెన్ బిర్యానీయే. అది లేకుంటే ఈ మేకకు ముద్ద దిగదు. ఈ మేక పేరు భూరి. మధ్యప్రదేశ్ లోని లోహారి గ్రామానికి చెందిన ఓ రైతు మేక ఇది.ఈ మేక ఇప్పుడే కాదు.. పుట్టినప్పటి నుంచి బిర్యానీయే తింటోందట.

goat eating chicken biryani in madhya pradesh

goat eating chicken biryani in madhya pradesh

Non Veg Goat : మాంసాహారం అంతే ఈ మేకకు చచ్చేంత ఇష్టం

గత మూడేళ్ల నుంచి ఇది చికెన్, మటన్ తింటుందట. బిర్యానీ లేకపోతే దానికి అస్సలు ముద్ద దిగదట. దీంతో తనకు చికెన్, మటన్ తో పాటు చేపలు, గుడ్డును కూడా పెడుతున్నాడట ఆ రైతు.ఈ వింత మేక గురించి తెలుసుకున్న అక్కడి స్థానికులు మేకను చూసేందుకు ఎగబడుతున్నారట. మేక చికెన్ బిర్యానీ తింటున్న ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది