Chicken Biryani : కుక్కర్ లో చికెన్ బిర్యానీ అందరూ ఎంతో ఈజీగా చేసుకోవడం ఎలాగో చూద్దాం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken Biryani : కుక్కర్ లో చికెన్ బిర్యానీ అందరూ ఎంతో ఈజీగా చేసుకోవడం ఎలాగో చూద్దాం…

 Authored By rohini | The Telugu News | Updated on :7 July 2022,8:20 am

Chicken Biryani : ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారంలో ఎన్నో రుచులను కోరుకుంటున్నాం. అలాంటి వాటిలో ఒకటి చికెన్ బిర్యాని ఈ చికెన్ బిర్యాని అంటే చిన్నపిల్లల సైతం ఇష్టపడుతుంటారు. దీనిని ఎక్కువగా రెస్టారెంట్ లలో తింటూ ఉంటారు. సండే వస్తే చాలు అందరూ చికెన్ బిర్యానీ కోసం రెస్టారెంట్లకు వెళుతూ ఉంటారు. అలాంటి చికెన్ బిర్యాని అందరూ ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు 1) బాస్మతి రైస్ 2) చికెన్ 3) పసుపు 4)ఉప్పు5) ఆయిల్ 6)నిమ్మరసం 7) నెయ్యి 8)సాజీర 9)యాలకులు 10)జీడిపప్పు 11)లవంగాలు, 12)బిర్యానీ ఆకు 13)దాల్చిన చెక్క 14)మరాఠీ మొగ్గలు15) నల్ల యాలకులు16 జాపత్రి 17)అనాసపువ్వు 18)రాతి పువ్వు 19)పచ్చిమిర్చి 20)ఉల్లిపాయలు 21)అల్లం వెల్లుల్లి పేస్ట్22) టమాటాలు 23)వాటర్ 24)జీలకర్ర పొడి 25)బ్లాక్ సాల్ట్ 26)మిర్యాల 27)పొడి ధనియా పౌడర్ 28)బిర్యానీ మసాలా29) 30)పెరుగు 31)కొత్తిమీర32) పుదీనా మొదలెగినవి.

తయారీ విధానం: రెండు గ్లాసుల బాస్మతి రైస్ ను తీసుకొని శుభ్రంగా కడుక్కొని 30 నిమిషాలు పాటు నానబెట్టుకోవాలి తరువాత 1/2 కేజీ చికెన్ తీసుకుని ఒక బౌల్లోకి వేసి దానిలోని ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ ని పోసుకొని బాగా మరగబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ ను తీసుకొని దాన్లో రెండు స్పూన్ల ఆయిల్ ను వేసి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని దాన్లో రెండు బిర్యానీ ఆకులు, ఒకటి జాపత్రి పువ్వు, ఒకటి అనాసపువ్వు, ఒకటి రాతి పువ్వు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు, ఒకటి దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, మూడు యాలకులు, ఒకటి నల్ల యాలకుల, నాలుగు మరాఠీ మొగ్గలు, అరకప్పు జీడిపప్పు, రెండు స్పూన్ల సాజీర, వేసి బాగా వేయించుకోవాలి. తరువాత ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.

Chicken biryani in cooker is very easy

Chicken biryani in cooker is very easy

తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపిన తర్వాత దానిలోకి జీలకర్ర పొడి ఒక స్పూన్, బ్లాక్ సాల్ట్ అర స్పూన్, మిరియాల పొడి అర స్పూన్, ధనియాల పౌడర్ ఒక స్పూన్, బిర్యానీ మసాలా రెండు స్పూన్లు, పెరుగు కప్పు, టమాట ముక్కలు సన్నగా తరిగిన ఒక కప్పు ఇవన్నీ వేశాక బాగా మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఈ మిశ్రమంలో వేయాలి. వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలిపి ఉంచాలి. తర్వాత మరిగించుకున్న నీళ్లను తీసుకొని ఈ మిశ్రమంలో వేసి కుక్కర్ మూత పెట్టాలి. అలా పెట్టిన తర్వాత 20 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన రాకపోయినా 20 నిమిషాల తర్వాత దింపేసుకోవాలి. దింపి వేసిన తర్వాత ఐదు నిమిషాలు తర్వాత దాని మూతను తీయాలి తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనా వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఎంతో ఈజీగా కుక్కర్లో బిర్యాని రెడీ.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

rohini

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది