పుత్తడి కొనుగోళ్లలో మోసపోతున్న వినియోగదారులను హాల్ మార్కింగ్ రక్షిస్తుందని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అలానే వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం పక్కా లెక్కలతో ప్రభుత్వానికి చేరుతుంది. బంగారు ఆభరణాలు, కళాఖండాలు తప్పనిసరిగా హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నెంబర్‌ను కలిగి వుండాలని స్పష్టం చేసింది. హెచ్‌యూఐడీ నెంబర్ ప్రతి బంగారు వస్తువుకు ప్రత్యేక గుర్తింపును నిర్ధారిస్తుంది. అంతేకాకుండా బంగారు వస్తువులు తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లోగో, స్వచ్ఛత గుర్తును కలిగి వుండాలి. గతంలో, హాల్‌మార్కింగ్ మూడు గ్రేడ్‌లకు మాత్రమే అవసరం, కానీ ఇప్పుడు అది 20 క్యారెట్లు, 23 క్యారెట్లు మరియు 24 క్యారెట్‌లతో సహా అందరికీ విస్తరించింది .
ప్రతి హాల్‌మార్క్ చేయబడిన బంగారు వస్తువు బీఐఎస్ లోగో, ఖచ్చితత్వ గ్రేడ్ మరియు ప్రత్యేకమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ప్రదర్శిస్తుంది. హెచ్యూఐడీ అనేది ప్రతి ఆభరణానికి ప్రత్యేక కోడ్ కేటాయిస్తుంది. బంగారం స్వచ్ఛత, హాల్‌మార్కింగ్‌పై కస్టమర్లు ఏవైనా ఫిర్యాదులు లేవనెత్తితే.. పరిష్కరించేందుకు ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ఈ కోడ్ ఆధారిత హాల్‌మార్కింగ్, స్వర్ణకారుల రిజిస్ట్రేషన్.. మానవప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఎలాంటి అవకతవకలకు తావుండదు. పారదర్శకత పెరగడం సహా, వినియోగదారుల హక్కులకు రక్షణ ఉంటుంది.తప్పనిసరి హాల్‌మార్కింగ్‌తో, ప్రతి ఆభరణం స్వచ్ఛత గ్రేడ్ మరియు హాల్‌మార్క్ కోడ్ వంటి క్లిష్టమైన సమాచారాన్ని కలిగి ఉండాలి, దీని వలన వినియోగదారులు నాణ్యతను ధృవీకరించడం సులభం అవుతుంది.
బీఐఎస్ ప్రకారం.. తమ వద్ద వున్న బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ లేని పక్షంలో వాటిని విక్రయించాల్సి వస్తే ఖచ్చితంగా హాల్‌మార్క్ పొందాలి. దీనికి సంబంధించి వినియోగదారులకు రెండు మార్గాలు వున్నాయి. బీఐఎస్ నమోదిత వ్యాపారి ద్వారా పాత ఆభరణాలకు హాల్‌మార్క్ చేయించుకోవచ్చు. సదరు ఆభరణాల వ్యాపారి హాల్‌మార్క్ చేయని బంగారు ఆభరణాలను బీఐఎస్ పరీక్ష, హాల్ మార్కింగ్ కేంద్రానికి తీసుకెళతారు. బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయడానికి వినియోగదారులు ఒక్కో ఆర్టికల్‌కు రూ.45 నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులకు అందుబాటులో వున్న రెండో మార్గం.. ఏదైనా బీఐఎస్ గుర్తింపు పొందిన అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ కేంద్రం నుంచి ఆభరణాలను పరీక్షించుకోవడం. ఆర్టికల్‌ల సంఖ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ వుంటే కనీసం రూ.200 నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి వుంటుంది. హాల్‌మార్కింగ్‌తో , కొనుగోలుదారులు అధిక-నాణ్యత, అసలైన బంగారాన్ని పొందుతారని, భారతదేశం అంతటా ఆభరణాలు మరియు కస్టమర్‌ల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందించుకుంటారని హామీ ఇవ్వవచ్చు
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.