Gold : బంగారం కొంటున్నారా.. అయితే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన కొత్త నిర్ణ‌యం గురించి తెలుసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gold : బంగారం కొంటున్నారా.. అయితే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన కొత్త నిర్ణ‌యం గురించి తెలుసుకోండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Gold : బంగారం కొంటున్నారా.. అయితే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన కొత్త నిర్ణ‌యం గురించి తెలుసుకోండి..!

పుత్తడి కొనుగోళ్లలో మోసపోతున్న వినియోగదారులను హాల్ మార్కింగ్ రక్షిస్తుందని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. అలానే వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం పక్కా లెక్కలతో ప్రభుత్వానికి చేరుతుంది. బంగారు ఆభరణాలు, కళాఖండాలు తప్పనిసరిగా హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నెంబర్‌ను కలిగి వుండాలని స్పష్టం చేసింది. హెచ్‌యూఐడీ నెంబర్ ప్రతి బంగారు వస్తువుకు ప్రత్యేక గుర్తింపును నిర్ధారిస్తుంది. అంతేకాకుండా బంగారు వస్తువులు తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లోగో, స్వచ్ఛత గుర్తును కలిగి వుండాలి. గతంలో, హాల్‌మార్కింగ్ మూడు గ్రేడ్‌లకు మాత్రమే అవసరం, కానీ ఇప్పుడు అది 20 క్యారెట్లు, 23 క్యారెట్లు మరియు 24 క్యారెట్‌లతో సహా అందరికీ విస్తరించింది .

Gold ఇవి తెలుసుకోండి..

ప్రతి హాల్‌మార్క్ చేయబడిన బంగారు వస్తువు బీఐఎస్‌ లోగో, ఖచ్చితత్వ గ్రేడ్ మరియు ప్రత్యేకమైన ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ప్రదర్శిస్తుంది. హెచ్యూఐడీ అనేది ప్రతి ఆభరణానికి ప్రత్యేక కోడ్ కేటాయిస్తుంది. బంగారం స్వచ్ఛత, హాల్​మార్కింగ్​పై కస్టమర్లు ఏవైనా ఫిర్యాదులు లేవనెత్తితే.. పరిష్కరించేందుకు ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ఈ కోడ్ ఆధారిత హాల్​మార్కింగ్, స్వర్ణకారుల రిజిస్ట్రేషన్.. మానవప్రమేయం లేకుండా జరిగిపోతుంది. ఎలాంటి అవకతవకలకు తావుండదు. పారదర్శకత పెరగడం సహా, వినియోగదారుల హక్కులకు రక్షణ ఉంటుంది.తప్పనిసరి హాల్‌మార్కింగ్‌తో, ప్రతి ఆభరణం స్వచ్ఛత గ్రేడ్ మరియు హాల్‌మార్క్ కోడ్ వంటి క్లిష్టమైన సమాచారాన్ని కలిగి ఉండాలి, దీని వలన వినియోగదారులు నాణ్యతను ధృవీకరించడం సులభం అవుతుంది.

Gold బంగారం కొంటున్నారా అయితే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన కొత్త నిర్ణ‌యం గురించి తెలుసుకోండి

Gold : బంగారం కొంటున్నారా.. అయితే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన కొత్త నిర్ణ‌యం గురించి తెలుసుకోండి..!

బీఐఎస్ ప్రకారం.. తమ వద్ద వున్న బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ లేని పక్షంలో వాటిని విక్రయించాల్సి వస్తే ఖచ్చితంగా హాల్‌మార్క్ పొందాలి. దీనికి సంబంధించి వినియోగదారులకు రెండు మార్గాలు వున్నాయి. బీఐఎస్ నమోదిత వ్యాపారి ద్వారా పాత ఆభరణాలకు హాల్‌మార్క్ చేయించుకోవచ్చు. సదరు ఆభరణాల వ్యాపారి హాల్‌మార్క్ చేయని బంగారు ఆభరణాలను బీఐఎస్ పరీక్ష, హాల్ మార్కింగ్ కేంద్రానికి తీసుకెళతారు. బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయడానికి వినియోగదారులు ఒక్కో ఆర్టికల్‌కు రూ.45 నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులకు అందుబాటులో వున్న రెండో మార్గం.. ఏదైనా బీఐఎస్ గుర్తింపు పొందిన అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ కేంద్రం నుంచి ఆభరణాలను పరీక్షించుకోవడం. ఆర్టికల్‌ల సంఖ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ వుంటే కనీసం రూ.200 నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి వుంటుంది. హాల్‌మార్కింగ్‌తో , కొనుగోలుదారులు అధిక-నాణ్యత, అసలైన బంగారాన్ని పొందుతారని, భారతదేశం అంతటా ఆభరణాలు మరియు కస్టమర్‌ల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందించుకుంటారని హామీ ఇవ్వవచ్చు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది