Good News : పదవ తరగతి చదివేవాళ్లకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5 వేలు పొందండి ఇలా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : పదవ తరగతి చదివేవాళ్లకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5 వేలు పొందండి ఇలా..!

Good News : ప్రస్తుతం మారుతున్న కాలంలో కూడా మన సమాజంలో ఆడ మగ తేడాలు ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ కూడా ఆడపిల్లను చిన్నచూపు చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో ఆడపిల్లల చదువు కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అలాగే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా ఆడపిల్లల చదువు కోసం ఎన్నో స్కాలర్ షిప్లను తీసుకొస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ పదో తరగతి విద్యార్థినిలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :10 November 2022,10:10 pm

Good News : ప్రస్తుతం మారుతున్న కాలంలో కూడా మన సమాజంలో ఆడ మగ తేడాలు ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికీ కూడా ఆడపిల్లను చిన్నచూపు చూసేవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో ఆడపిల్లల చదువు కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అలాగే స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా ఆడపిల్లల చదువు కోసం ఎన్నో స్కాలర్ షిప్లను తీసుకొస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ పదో తరగతి విద్యార్థినిలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిభవంతులైన విద్యార్థినీలకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్ట్ భువనేశ్వరి తెలిపారు. దీనికోసం గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత ఎనిమిదేళ్లుగా జీఈఎస్టి పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 4న నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి తెలియజేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. ఇక ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేస్తామని తెలిపారు. ఈ క్రమంలో మొదటి పది ర్యాంకులు పొందిన బాలికలకు 5000 చొప్పున అందజేస్తామని తెలిపారు. అలాగే తర్వాత 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3000 చొప్పున అందజేస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపారు.

Good news for 10th class students get Rs5 thousand per month

Good news for 10th class students get Rs.5 thousand per month

వీరందరికీ ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసే వరకు స్కాలర్షిప్ ఇస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినిలు www.ntrtrust.org వెబ్సైట్లో ఈనెల 11 నుంచి 30 లోపు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇంకా మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 7660002627 లేదా 7660002628 నెంబర్లకు ఫోన్ చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నారా భువనేశ్వరి సూచించారు. ఆసక్తి గల విద్యార్థినిలు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది