Good News : ఏపీలో ప్రభుత్వం రైతుల కోసం పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రైతులకు కూలీల కొరత తగ్గించేందుకు.. పనులు తొందరగా చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. అద్దె ప్రాతిపదికన వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తోంది. ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పనులకు సాయం అందిస్తోంది. అలాగే కమ్యూనిటీ హైరింగ్ పద్ధతిలో ట్రాక్టర్లు, యంత్రపరికరాలను అందిస్తోంది. తాజాగా యంత్ర పరికరాలను రైతులకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే రైతులకు ఎలాంటి పరికరాల అవసరం ఉందో గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టింది.
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి 20 మంది చొప్పున రైతులను ఎంపిక చేసిన ప్రభుత్వం మొత్తం లక్షా 80వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరిచింది. వీరిలో అత్యధికంగా 34శాతం మంది పురుగు ముందులు చల్లేందుకు స్ప్రేయర్లు కావాలని కోరారు. 25 శాతం మంది టార్పాలిన్లు, 15శాతం మంది భూమిని చదును చేసేందుకు కల్టివేటర్ల వంటి పరికరాలు కావాలన్నారు. 12 శాతం మంది.. సెల్ప్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ 9 శాతం మంది రోటోవేటర్స్, 4 శాతం మంది సీడింగ్ పరికరాలు ఒక శాతం మంది మిస్క్ ఎక్విప్‌మెంట్ కావాలన్నారు. దీంతో ఈ పథకానికి ప్రభుత్వం మొత్త రూ.403 కోట్లు ఖర్చు చేయనుంది. ఏపీ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రూ.403 కోట్ల విలువైన పరికరాలను రైతులకు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 కోట్ల అంచనా వ్యయంతో ఆర్బీకే స్థాయిలోనే రూ.6లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల విలువైన 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు నెలకొల్పనుంది.
వరి ఎక్కువ పండించే ప్రాంతాల్లో రూ.10 లక్షల సబ్సిడీతో రూ.25లక్షలు విలువైన కంబైన్డ్ హార్వెస్టర్స్ తో కూడిన 1,615 క్లస్టర్ లెవల్ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే రూ.691 కోట్ల వ్యయంతో 6,781 రైతు భరోసా కేంద్రాలు, 391 క్లస్టర్ లెవల్ యంత్రసేవా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇటీవలై రైతు రథం పేరుతో రూ.175 కోట్లతో రూ.3,800 ట్రాక్టర్లను రైతులకు అందించిన ప్రభుత్వం అదనంగా ఈ యంత్ర పరికరాలను కూడా అందించనుంది. ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రకారం గ్రామానికి 25 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఆరవై ఎనిమిది వేల మందిని ఎంపిక చేసి రూ.15వేల విలువైన వ్యవసాయ యూనిట్లను అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే గ్రామానికి 8 మంది చొప్పున మొత్తం ఎనబై వేల మందికి రూ.50 వేల విలువైన రెండు యూనిట్లను 50 శాతం సబ్సిడీతో మంజూరు చేయనున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.