EPFO : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా .. అయితే ఈ శుభవార్త మీకే !
EPFO : పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త ఇది. ఎందుకంటే పిఎఫ్ వడ్డీ డబ్బులు సబ్స్క్రైబర్ల పిఎఫ్ ఖాతాలోకి జమవుతుంది. 8.1% చొప్పున వడ్డీ డబ్బులు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి లభిస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ డబ్బులను ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్ల పిఎఫ్ అకౌంట్ లోకి జమ చేస్తుంది. ఇప్పటికే మీకు ఈ వడ్డీ డబ్బులు వచ్చి ఉండవచ్చు. లేదంటే త్వరలోనే మీ పిఎఫ్ అకౌంట్ లో జమ కావచ్చు. పీఎఫ్ అకౌంట్ లో పది లక్షలు ఉంటే వడ్డీ రూపంలో 81000 లభిస్తాయి. అలాగే పిఎఫ్ అకౌంట్లో ఏడు లక్షలు ఉంటే 56,700 వరకు లభిస్తాయి. ఇంకా పిఎఫ్ ఖాతాలో ఐదు లక్షలు ఉంటే వడ్డీతో కలిపి 40,500 వరకు లభిస్తాయి.
అలాగే ఈపీఎఫ్ ఖాతాలో లక్ష పిఎఫ్ డబ్బులు ఉంటే 8100 వరకు వడ్డీ డబ్బులు లభిస్తాయి. పిఎఫ్ అకౌంట్ లోని అమౌంట్ ప్రాతిపదికన వడ్డీ డబ్బులు లభిస్తాయి. ప్రస్తుతం పీఎఫ్ ఖాతా పైన 8.1 శాతం వడ్డీ లభిస్తుంది. గత 40 ఏళ్లలో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. కరోనా ప్రతికూల పరిస్థితులు నేపథ్యంలో ఈపీఎఫ్ఓ కూడా వడ్డీ రేటు తగ్గించింది. అయితే పిఎఫ్ డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఎంతో సమయం పట్టదు కేవలం రెండు నిమిషాల్లో వ్యవధిలోని పిఎఫ్ ఖాతాలో డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా 011 22901406 కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది.
పిఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో మెసేజ్ వస్తుంది. అయితే ఈ సర్వీసులు పొందాలంటే ఆధార్ కార్డ్, యుఏఎన్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి. ఇలా కాకుండా నేరుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ కి వెళ్లి బాలన్స్ చెక్ చేసుకోవచ్చు. యుఏఎన్ పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. తర్వాత పాస్ బుక్ చెక్ చేసుకుంటే వడ్డీ డబ్బులు వచ్చాయా లేదా అని విషయం తెలుస్తుంది. ఇలా కాకుండా ఇంకా మరో ఆప్షన్ కూడా ఉంది. ఉమాంగ్ యాప్ ద్వారా కూడా డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ఉమాంగ్ యాప్ వాడుతూ ఉండాలి. యాప్ లోకి వెళ్లి ఈపీఎఫ్ ఓ సర్వీసులు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వ్యూ పాస్ బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో పీఎఫ్ డబ్బులు ఎంత ఉన్నాయో తెలుస్తుంది.