Property Owners : ఈ పత్రం ఇక ఆన్‌లైన్‌లోనే.. సొంత ఆస్తి ఉన్నవారు ఆందోళన చెందనక్కర్లేదు…!
ప్రధానాంశాలు:
Property Owners : ఈ పత్రం ఇక ఆన్‌లైన్‌లోనే.. సొంత ఆస్తి ఉన్నవారు ఆందోళన చెందనక్కర్లేదు...!
Property Owners : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక అనేక రూల్స్ అమలవుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అవకతవకలకి చెక్ పెట్టేలా ప్రభుత్వం అనేక రూల్స్ తీసుకొస్తుంది. ఆస్తుల వ్యవహారంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతుండగా, నకిలీ ఆస్తుల పత్రాల సృష్టి మరియు మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం తరచుగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తుండడం గమనర్హం. అయితే ఆస్తి యజమానులు ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చింది.
Property Owners ఆస్తి యజమానులకు గుడ్ న్యూస్…
రాష్ట్రంలో భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసి నకిలీ పత్రాల సృష్టి, మోసాలను పూర్తిగా అరికట్టడంతో పాటు దేవాదాయ శాఖకు చెందిన అన్ని పత్రాలు ఆన్‌లైన్‌లో ఉంచనుంది. ఈ భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ 90 శాతం పూర్తి కాగా , నకిలీ పత్రాలు సృష్టించి సామాన్యులను మోసం చేస్తున్న అక్రమాలను అరికట్టేందుకు, రెవెన్యూ పత్రాలు ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా భూ రికార్డుల డిజిటలైజేషన్ చేపట్టారు. తాలూకా స్థాయి ఏడీఎల్ఆర్ కార్యాలయాల్లోని అన్ని రికార్డు గదులు డిజిటలైజ్ చేయబడ్డాయి మరియు భూ రికార్డులకు సంబంధించిన యజమానుల ఆధార్ అనుసంధానం పురోగతిలో ఉంది. 2012 నుంచి 21 వరకు నమోదైన సుమారు రెండు కోట్ల ఆస్తి పత్రాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేస్తున్నారు.

Property Owners : ఈ పత్రం ఇక ఆన్‌లైన్‌లోనే.. సొంత ఆస్తి ఉన్నవారు ఆందోళన చెందనక్కర్లేదు…!
అయితే 2025 సంవత్సరానికి అన్ని తాలుకా కార్యాలయాలని పేపర్‌లెస్‌గా మార్చడం ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. భూ రికార్డుల డేటాబేస్‌తో ఆధార్ నంబర్‌ను అనుసంధానించడం ద్వారా రెవెన్యూ శాఖ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేకుండా, ఆస్తులకు సంబంధించిన అన్ని అవసరాలు ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. సొంత ఆస్తులు ఉన్నవారికి నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.