Train Ticket Booking : రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు.. తెలుసుకోకపోతే మీకే బొక్క
ప్రధానాంశాలు:
Train Ticket Booking : రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు..తెలుసుకోకపోతే మీకే బొక్క
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ బుకింగ్ మరియు రీఫండ్ నిబంధనలను సమూలంగా మార్చేసింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, రైల్వే ఆదాయ నష్టాన్ని నివారించే లక్ష్యంతో ఈ కొత్త మార్పులను ప్రవేశపెట్టింది.
Train Ticket Booking : రైళ్ల టికెట్ల బుకింగ్ లో కొత్త మార్పులు.. తెలుసుకోకపోతే మీకే బొక్క
రైల్వే కొత్త రూల్స్:
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్ఏసీ (RAC) రద్దు: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇకపై స్లీపర్ క్లాస్‌లో ఆర్ఏసీ (Reservation Against Cancellation) టిక్కెట్లు ఉండవు. సాధారణంగా టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఒకే బెర్త్‌ను ఇద్దరికి కేటాయించే ఆర్ఏసీ విధానాన్ని ఈ రైళ్లలో నిలిపివేశారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయాణం ప్రారంభం నుంచే కన్ఫర్మ్డ్ బెర్తులు లభిస్తాయి. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) మొదలైనప్పటి నుంచే అన్ని బెర్త్‌లు కన్ఫర్మ్ స్టేటస్‌తోనే జారీ చేయబడతాయి. అయితే, మహిళలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు ఉండే ప్రత్యేక కోటాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.
కఠినతరమైన క్యాన్సిలేషన్ మరియు రీఫండ్ నిబంధనలు:
ప్రీమియం రైళ్లలో టికెట్ రద్దు చేసుకునే వారిపై రైల్వే బోర్డు కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటల లోపు కన్ఫర్మ్డ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే, ప్రయాణికులకు పైసా కూడా రీఫండ్ లభించదు (Zero Refund). ఒకవేళ 72 గంటల కంటే ముందు రద్దు చేస్తే 25 శాతం, 72 నుండి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం ఛార్జీని కోత విధిస్తారు. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు పాక్షిక రీఫండ్ పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును ఈ ప్రీమియం రైళ్లకు తొలగించారు.
ఆదాయ నష్టం నివారణే ప్రధాన ఉద్దేశ్యం:
చివరి నిమిషంలో టికెట్లు రద్దు కావడం వల్ల బెర్తులు ఖాళీగా ఉండిపోయి, రైల్వేలకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోంది. కన్ఫర్మ్ అయిన సీట్లు వృథా కాకుండా ఉండటానికే ఈ ‘ప్రీమియం క్యాన్సిలేషన్’ పాలసీని తెచ్చినట్లు అధికారులు వివరిస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే ఖరారు చేసుకోవాలని, అనిశ్చితి ఉంటే సాధ్యమైనంత త్వరగా టికెట్లు రద్దు చేసుకోవాలని రైల్వే సూచిస్తోంది. ఈ మార్పుల వల్ల నిజమైన ప్రయాణికులకు కన్ఫర్మ్డ్ సీట్లు దొరికే అవకాశం పెరుగుతుందని, అదే సమయంలో అనవసరమైన రద్దులు తగ్గుతాయని రైల్వే ఆశిస్తోంది.