Special Trains | దసరా స్పెషల్ ట్రెయిన్‌లు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Special Trains | దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్‌లో ప్రయాణాలను సౌకర్యవంతంగా మార్చేందుకు వివిధ మార్గాల్లో 52 ప్రత్యేక రైళ్లను నడపనుందని అధికారులు ప్రకటించారు. ఇవి సెప్టెంబర్ 13 నుంచి నవంబర్ 27 వరకు దశలవారీగా అందుబాటులో ఉంటాయి.
#image_title
చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ఇప్పటికే సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యాయి. చర్లపల్లి – అనకాపల్లి (07035) రైలు ప్రతి శనివారం, అనకాపల్లి – చర్లపల్లి (07036) రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఈ రైళ్లు అక్టోబర్ 5 వరకు కొనసాగనున్నాయి. మార్గంలో జనగామ, వరంగల్, ఖమ్మం, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి వంటి స్టేషన్లలో ఆగనుంది. ఫస్ట్ AC నుంచి జనరల్ క్లాస్ వరకూ అన్ని కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
చర్లపల్లి – తిరుపతి మార్గం
సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు
మొత్తం 16 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
నాందేడ్ – ముంబయి మార్గం
4 ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు.
ఇది ముంబయి వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
తిరుపతి – అనకాపల్లి మార్గం
అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 27 వరకు
8 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
విశాఖపట్నం – తిరుపతి రూట్
సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 24 వరకు విశాఖ – తిరుపతి మధ్య 11 ప్రత్యేక రైళ్లు
తిరుపతి – విశాఖ మధ్య 11 ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 25 వరకు నడుస్తాయి.
సంబల్‌పూర్ – ఇరోడ్ మార్గం
సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 26 వరకు
సంబల్‌పూర్ – ఇరోడ్ (08311) మధ్య 11 సర్వీసులు
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 28 వరకు ఇరోడ్ – సంబల్‌పూర్ (08312) మధ్య 11 రైళ్లు నడుస్తాయి.