SBI : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు
SBI : ఫిక్డ్స్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 10 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పటికే ఇతర బ్యాంకులు పెంచగా ప్రభుత్వ రంగా బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్ల నుంచి 40 బేసిస్ పాయింట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇంతకుముందు 3.10 శాతం వడ్డీ రేట్లును పొందే ఎఫ్డీలకు ప్రస్తుతం 3.60 శాంతం పొందవచ్చు. సీనియర్ సిటిజన్ల ఎఫ్డీపై 3.60 శాతం నుంచి 4.10 శాతం పెంచారు. ఈ కొత్త రేట్లు రెండు రకాల ఎఫ్డీలపై వర్తించనున్నాయి.కాగా పెంచిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లకు అలాగే రెన్యూవల్ డిపాజిట్లకు వర్తించనుంది.
ఎస్‌బీఐ ఇప్పుడు 2 ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఫిబ్రవరి 15 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందని బ్యాంక్ తెలిపింది. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ ఎఫ్‌డీలపై ఇకపై 5.2 శాతం వడ్డీ లభిస్తుంది.మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లనుకు వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో ఈ ఎఫ్‌డీలపై ఇకపై 5.45 శాతం వడ్డీ పొందొచ్చు. అలాగే ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో ఈ ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతానికి చేరింది.
ఈ కొత్త వడ్డీ రేట్లు రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీలకు మాత్రమే వర్తిస్తాయి.కాగా ఎస్బీఐ జనవరి నెలలో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. అప్పుడు ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో వీటిపై వడ్డీ రేటు 5.1 శాతానికి పెరిగింది. జనవరి 15 నుంచి ఈ రేట్లు అమలులో ఉన్నాయి. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 5.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇకపోతే దేశీ కేంద్ర బ్యాంక్ ఆర్‌బీఐ ఇటీవలి పాలసీ సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే. అయినా కూడా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం.