Union Budget 2022 : బ్రేకింగ్.. ఆన్లైన్ క్లాసులు వినే వాళ్లకు గుడ్ న్యూస్, కొత్త యూనివర్సిటీ వచ్చేస్తుంది…!
Union Budget 2022 : కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా కీలక ప్రకటన చేసారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, అందులో భాగంగా ప్రాంతీయ భాషలతో చానల్స్ ప్రారంభిస్తామని చెప్పారు నిర్మల. అలాగే ప్రత్యేక డిజిటల్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తామని అన్నారు. డిజిటల్ విద్యకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు.
చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంటీ పథకం తీసుకొస్తామని చెప్పారు. 400 చానల్స్ లో పిఎం ఈ విద్యను అందిస్తామని తెలిపారు. సాంకేతిక ఆధారిత అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ విద్యకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రధాని ఈ విద్య కార్యక్రమం కింద టెలివిజన్ చానల్స్ 12 నుంచి 200 కి పెంచుతామని చెప్పారు.
ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ ఉంటుందని ప్రకటించారు. విద్యార్ధులకు అందుబాటులో ఈ కంటెంట్ ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచ స్థాయి ఉపకరణాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో విద్యార్ధులు నష్టపోకుండా వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని నిర్మలమ్మ ప్రకటించారు.