Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు.. పెరిగేవి.. త‌గ్గేవి ఇవే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు.. పెరిగేవి.. త‌గ్గేవి ఇవే..!

Union Budget 2024 Live Updates | income tax slabs: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ Finance Minister Nirmala Sitharaman  ఈరోజు ఉదయం 11 గంటలకు మద్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వరుసగా ఆరో సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ప్రస్తుత లోక్ సభకు ఇదే చివరి బడ్జెట్ అయినందువలన ఎలాంటి ప్రకటనలు వెలువడుతాయి అనేదానిపై […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,12:18 pm

ప్రధానాంశాలు:

  •  Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. 300 యూనిట్ల ఉచిత క‌రెంట్‌.. పెరిగేవి.. త‌గ్గేవి ఇవే..!

  •  బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. ఏడాదికి 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు

  •   దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు

Union Budget 2024 Live Updates | income tax slabs: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ Finance Minister Nirmala Sitharaman  ఈరోజు ఉదయం 11 గంటలకు మద్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వరుసగా ఆరో సారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ప్రస్తుత లోక్ సభకు ఇదే చివరి బడ్జెట్ అయినందువలన ఎలాంటి ప్రకటనలు వెలువడుతాయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్యంతర బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థ తో పాటు ఎన్నికల పరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చని అంచనా. మరో 70 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో వస్తున్న మధ్యంతర బడ్జెట్ ఇది. ఇందులో కొత్త పథకాలుమ కొత్త హామీలు ఉండవు కానీ ఆల్రెడీ కొనసాగుతున్న వాటిపై బడ్జెట్ రూపకల్పన జరగనుంది.

దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయి. India భారత్ లోని 57% సంపద 10 శాతం మంది సంపన్నుల చేతిలో ఉంది. మిగతా 43 శాతం సంపద 90 శాతం మంది మధ్యతరగతి పేదల చేతిలో ఉంది. ముఖ్యంగా దేశంలోని 50% మంది దగ్గర 13 శాతం సంపదే ఉంది. కరోనా సమయంలో బిలియనీర్ లు మరింత సంపదను పెంచుకున్నారు. పేద మధ్య తరగతి వారు కృంగిపోయారు. ఇండియాలో నిరుద్యోగం, పేదరికం, ఆకలి చావులు వంటివి అలాగే ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్ సమయంలో కొత్త పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తారు. అయితే ఇండియాలో ఇప్పటికే పథకాలు ఎక్కువయ్యాయి. ఉచిత పథకాలను క్రమంగా తగ్గించాలని చూస్తున్న కేంద్రం ఈసారి బడ్జెట్ పై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని ముందే చెబుతుంది.

దానికి తోడు మరోసారి బీజేపీ BJP అధికారంలోకి వస్తుందని ప్రచారం కూడా ఉంది. దాంతో ఈసారి Union Budget 2024 బడ్జెట్ సాదాసీదా గానే ఉంటుందని తెలుస్తోంది. ఈ బడ్జెట్ ఆసక్తిగా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో కొంత అసంతృప్తి వ్యక్తం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువలన కొంతవరకైనా పేదవారు, బడుగు బలహీన వర్గాల వారికి అనుకూల నిర్ణయాలు ఉంటాయని ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి వ్యవసాయానికి అనుకూలమైన బడ్జెట్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇక మధ్యంతర బడ్జెట్ ని ఓట్ ఆన్ అకౌంట్ On Account అని కూడా పిలుస్తారు. ఇది పూర్తి బడ్జెట్ ను సమర్పించడానికి సమయం లేదా ఆదేశం లేనప్పుడు ప్రభుత్వం సమర్పించే తాత్కాలిక ఆర్థిక ప్రణాళిక.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి కోసం కొత్త మిషన్

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  జై విజ్ఞాన్, జై కిసాన్, జై అనుంధాన్ అన్నది ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కొత్త పరిజ్ఞానం, మార్కెట్ వ్యవస్థ అనుసంధానంతో సాగు రంగాలకు కొత్త ఆదాయ మార్గాలు. సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతం.

విమానయాన రంగంలో 2,3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు

రైలు మార్గాలలో హైట్రాఫిక్, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు ఏర్పాటు. రైలు బోగి లన్నింటిని వందే భారత్ ప్రమాణాలతో మార్పు. మన విమానయాన సంస్థలు వెయ్యి విమానాలకు పైగా ఆర్డర్ చేశాయి.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. ఫేస్ లెస్ విధానంతో పారదర్శకత, సత్వర రిటర్న్ ల చెల్లింపులు

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  సరాసరి నెలవారి జీఎస్టీ ఆదాయం రూ. 1.66 కోట్లకు చేరింది. జీఎస్టీ ముందున్న విధానం కన్నా ప్రస్తుత ఆదాయం రెట్టింపు. అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త సంస్కరణలు. జల, వాయు మార్గాల్లో కొత్త కంటెయినిరిటీ పోల్ ఏర్పాటు చేస్తున్నాం. వికసిత భారత్ కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల వ్యవధితో 75 వేల కోట్ల రుణాలు. సాగు ఉత్పత్తుల విలువ జోడింపుతో రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పథకాలు.

సాగు ఉత్పత్తుల కోసం గిడ్డంగులు, ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం

నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కొత్త పథకం. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సాయం. రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్ గోకుల మిషన్ ద్వారా ఆర్థిక సాయం. పన్ను రేట్ల హేతుబద్ధతతో పన్ను చెల్లింపుదారులకు భారం తగ్గించాం.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధనస్సు కార్యక్రమం

 

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. భారత్ నుంచి మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్ నకు ప్రత్యేక కారికాడర్. మౌలిక వసతుల రంగానికి 11.11 లక్షల కోట్ల కేటాయింపు.ఎఫ్డిఐ పెట్టుబడులు పెరిగాయి. విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణ యుగం. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తాం. సంస్కరణలు అమలకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు 75 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. దేశ తూర్పు ప్రాంతాన్ని నూతన అభివృద్ధి రథంగా మారుస్తున్నాం

 

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ మూల సూత్రాలుగా భారత్ ముందడుగు వేస్తుంది. 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాం. అవకాశాల సృష్టితో ఆకాశమే హద్దుగా భారత్ ముందడుగు వేస్తుంది. కొత్త ప్రపంచంతో అనుసంధానం అవుతూ భారత్ దిక్సూచిగా నిలబడుతుంది. విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించాం.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కులు

 

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..   పాడి రైతుల ప్రోత్సాహానికి ప్రత్యేక సమగ్ర కార్యక్రమం. నానో యూరియా తర్వాత పంటలకు నానో డిఏపి కింద ఎరువులు అందిస్తాం. ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మ నిర్భరత సాధిస్తాం. స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు. లక్ పతీ దీది టార్గెట్ ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నాం. పరిశోధన సృజనాత్మకతకు లక్షల కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం. మౌలిక వసతుల రంగం 11.1% వృద్ధితో 11 లక్షల 11 వేల 111 కోట్ల కేటాయింపు.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. ఆశాలు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు!

 

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  | Key Announcements, Tax Changes, Investments |9 -18 ఏళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు. మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తాం.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. మధ్య తరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం

 

Union Budget 2024 Live Updates : | Priority is given to construction of houses for middle class | బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  జిల్లాలు, బ్లాక్ లు అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్. బస్తీలో అద్దె ఇళ్లలో ఉండే వారి సొంత ఇంటి కలను నిజం చేస్తాం. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. జీడీపీకి ఈ ప్రభుత్వం కొత్త అర్థం చెప్పింది

 

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. | Indias real GDP growth at closer to 7% in 2024-25 | స్టార్ట్ అప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసాం. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్ళలో 70 శాతం మహిళల పేరు పైన ఇచ్చాం. జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫామెన్స్ అని కొత్త అర్థం ఇచ్చాం. ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచాం.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  ప్రజల ఆదాయం 50% పెరిగింది

 

Union Budget 2024 Live Updates : No change in slabs Income Tax Budget 2024 | బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  ప్రపంచ దేశాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. భారత్ మాత్రం వాటికి అతీతంగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధి కనబడుతుంది. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించాం.

Union Budget 2024 Live Updates : బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. యువతకు ముద్రా యోజనతో రూ. 25 లక్షల కోట్లు రుణాలు

 

Union Budget 2024 Live Updates : Finance Minister Nirmala Sitharaman presented the Interim Budget 2024-25 | బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. జీఎస్టీ వంటి ట్యాక్స్ సంస్కరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయి. క్రీడల్లో సాధించిన పతకాలు యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించాం.

 

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక