Good News : ప్రస్తుతం దేశంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సంక్షోభంలో కొత్త ఉద్యోగాలు అనేవి రాక నిరుద్యోగులు చాలా బాధ పడుతున్నారు. అయితే ఇలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా ఉంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి దాకా అన్ని విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో సేల్స్ మేనేజర్ నుంచి మొదలు కుంటే.. సీనియర్ మేనేజర్ లాంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం.అయితే ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.
దరఖాస్తు చేసుకన్న వారిని షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. 14 వ తేదీలోపు వీటికి అప్లై చేసుకోవాలి. మొత్తం 220 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులుగా ప్రకటించింది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ ఇన్ బ్యాంకింగ్ లేదంటే సేల్స్ తో పాటు మార్కెటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. కాగా సేల్స్ మేనేజర్ కు అప్లై చేసుకునే వారు 32–48 ఏండ్ల మధ్య వయసు ఉండాలి.కాగా దీని కోసం 12 ఏళ్ల అనుభవం ఉండాలి. ఇక రీజినల్ సేల్స్ మేనేజర్ కావాలనుకుంటే 28–45 ఏండ్లు ఉండాలి. దీనికి కూడా 8 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
ఇక అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టు కోసం 28 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. వీరికి కూడా 8ఏళ్లు అనుభవం ఉండాలి. ఇక సీనియర్ మేనేజర్ కు అప్లై చేసుకునే వారికి 25 నుంచి 37 ఏళ్ల మధ్యలో వయసుండాలి. వీరికి మాత్రం 5 ఏళ్ల అనుభవం కావాలి. ఇక వచ్చిన అప్లికేషన్లలో ది బెస్ట్ అనుకునే వాటిని ఫైనల్ లిస్ట్ చేస్తారు. అయితే అనుభవాన్ని బట్టి జీతం ఉంటుంది. కాగా పైన చెప్పిన వాటన్నింటినీ 5ఏళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. అప్లై చేసుకునే వారు https://www.bankofbaroda.in/career.htm వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.