Good News : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 220 ఉద్యోగాలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Good News : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 220 ఉద్యోగాలు..

Good News : ప్ర‌స్తుతం దేశంలో చాలా దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. క‌రోనా సంక్షోభంలో కొత్త ఉద్యోగాలు అనేవి రాక నిరుద్యోగులు చాలా బాధ‌ ప‌డుతున్నారు. అయితే ఇలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ వ‌చ్చింది. ఆర్థిక రాజ‌ధాని ముంబై కేంద్రంగా ఉంటున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఇందులో పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి దాకా అన్ని విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో సేల్స్‌ మేనేజర్ నుంచి మొద‌లు కుంటే.. సీనియర్‌ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :9 February 2022,9:00 pm

Good News : ప్ర‌స్తుతం దేశంలో చాలా దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. క‌రోనా సంక్షోభంలో కొత్త ఉద్యోగాలు అనేవి రాక నిరుద్యోగులు చాలా బాధ‌ ప‌డుతున్నారు. అయితే ఇలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ వ‌చ్చింది. ఆర్థిక రాజ‌ధాని ముంబై కేంద్రంగా ఉంటున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఇందులో పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి దాకా అన్ని విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో సేల్స్‌ మేనేజర్ నుంచి మొద‌లు కుంటే.. సీనియర్‌ మేనేజర్ లాంటి పోస్టుల‌కు కూడా నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.అయితే ఈ ఉద్యోగాల‌కు డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.

ద‌ర‌ఖాస్తు చేసుక‌న్న వారిని షార్ట్‌లిస్ట్ చేసిన త‌ర్వాత పర్సనల్‌ ఇంటర్వ్యూల‌కు పిలుస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగ అవ‌కాశం ల‌భిస్తుంది. 14 వ తేదీలోపు వీటికి అప్లై చేసుకోవాలి. మొత్తం 220 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులుగా ప్ర‌క‌టించింది. ముఖ్యంగా మేనేజ్‌మెంట్‌ ఇన్‌ బ్యాంకింగ్ లేదంటే సేల్స్ తో పాటు మార్కెటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. కాగా సేల్స్‌ మేనేజర్ కు అప్లై చేసుకునే వారు 32–48 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి.కాగా దీని కోసం 12 ఏళ్ల అనుభవం ఉండాలి. ఇక రీజినల్‌ సేల్స్‌ మేనేజర్ కావాల‌నుకుంటే 28–45 ఏండ్లు ఉండాలి. దీనికి కూడా 8 ఏళ్ల అనుభవం త‌ప్ప‌నిస‌రి.

good news for unemployed 220 jobs in bank of baroda

good news for unemployed 220 jobs in bank of baroda

Good News : ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి…

ఇక అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్ పోస్టు కోసం 28 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. వీరికి కూడా 8ఏళ్లు అనుభ‌వం ఉండాలి. ఇక సీనియర్‌ మేనేజర్ కు అప్లై చేసుకునే వారికి 25 నుంచి 37 ఏళ్ల మధ్యలో వ‌య‌సుండాలి. వీరికి మాత్రం 5 ఏళ్ల అనుభవం కావాలి. ఇక వ‌చ్చిన అప్లికేష‌న్ల‌లో ది బెస్ట్ అనుకునే వాటిని ఫైన‌ల్ లిస్ట్ చేస్తారు. అయితే అనుభ‌వాన్ని బ‌ట్టి జీతం ఉంటుంది. కాగా పైన చెప్పిన వాట‌న్నింటినీ 5ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో తీసుకుంటున్నారు. అప్లై చేసుకునే వారు https://www.bankofbaroda.in/career.htm వెబ్ సైట్‌లో అప్లై చేసుకోవాలి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది