Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతంతో పాటు అదనంగా 30 వేలు
Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వచ్చే జీతంతో పాటు ఇతరత్రా అలవెన్స్ లు కూడా వస్తుంటాయి. డీఏ కూడా పెంచుతూ పోతుంటారు. డీఏతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి. కేవలం అలవెన్సుల రూపంలోనే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందొచ్చు.
చాలామంది పీజీలు చేసిన వాళ్లు.. పీహెచ్డీ చేసిన వాళ్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటారు. ఉన్నత డిగ్రీ చదివిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి ప్రోత్సాహకాలను అందించనుంది. వారి ప్రోత్సాహకాలను 5 రెట్లు పెంచింది.ఉన్నత విద్య చదివిన వాళ్లు.. ముఖ్యంగా పీహెచ్డీ చేసిన వాళ్లకు కేంద్రం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇదివరకు ఈ ప్రోత్సాహకాలు 2000 వరకే ఉండేది.
Good News : పీహెచ్డీ చేసిన వాళ్లను 10 వేల నుంచి 30 వేల వరకు ప్రోత్సాహకాలు
ఇప్పుడు కనీస ప్రోత్సాహకం 10 వేలకు పెంచారు.డిప్లొమా చేసిన వాళ్లకు రూ.10 వేలు, ఒకవేళ 3 సంవత్సరాల కన్నా.. ఎక్కువ కాల పరిమితి ఉన్న వాళ్లు.. డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్లకు రూ.15 వేల ప్రోత్సాహకాన్ని కేంద్రం అందించనుంది. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనుకుంటే రూ.20 వేల ప్రోత్సాహకాన్ని కేంద్రం అందిస్తుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే కనీసం రూ.25 వేలు అందిస్తారు.