Good News : కేవలం రూ.251లతో రూ.20 లక్షలు మీ సొంతం.. ఎలాగో మీకు తెలుసా?
Good News : భారతీయ దిగ్గజ బీమా సంస్థ ఎల్‌ఐసీ.. పైన ఎంతో మందికి నమ్మకం ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీమా రంగంలో దిగ్గజ సంస్థగా ఉన్న భారతీయ జీవిత బీమా సంస్థ..ఇన్వెస్టర్లకు గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది. కరోనా మహమ్మారి వలన జనం ఆదాయం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద రాబడిని పొందే పథకాన్ని ఎల్ ఐసీ రూపొందించింది. అదేంటంటే..
ఎల్ ఐసీ వారు రూపొందించిన ఆ పాలసీ పేరు ‘జీవన్ లాభ్ పాలసీ’. ఈ పాలసీలో పెట్టుబడిదారులు రోజు కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే చాలు.. మెచ్యూరిటీ సమయంలో లక్షల రాబడిని పొందవచ్చును. ఈ పాలసీలో పెట్టుబడి దారులు ప్రతీ రోజుకు దాదాపుగారూ.251.7 చొప్పున పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయంలో రూ.20 లక్షలు పొందవచ్చును.ఇకపోతే ఈ ఎల్ ఐసీ పథకం కింద ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఆదాయపు పన్ను తగ్గింపు ఉండే అవకాశం ఉంది. ఈ పథకంలో కనీస బీమా మొత్తం రూ.2 లక్షలు. కాగా, మొత్తం హామీపై గరిష్ట పరిమితి అయితే లేదు.
Good News : రోజు కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తే చాలు..
ఇక ఈ పాలసీలో చేరడానికి కనీస వయసు ‘ ఏళ్లు. కాగా, గరిష్టం 16 సంవత్సరాల పాలసీ కాలానికి 59 ఏళ్లు పరిమితి. పాలసీ దారులు 16 నుంచి 25 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధి కూడా 10 నుంచి 16 ఏళ్ల వరకు ఉంటుంది. పాలసీదారులు ఈ స్కీమ్‌లో నెలవారీగానో లేదా త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన క్రమం తప్పకుండా ప్రీమియంలను చెల్లించుకోవచ్చును. నెలవారీ చెల్లింపులకుగాను 15 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా వీళ్లు ఎక్స్ ట్రాగా పొందవచ్చును.