LIC Bima Sakhi Yojana : మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త.. ఎల్‌ఐసీ ‘బీమా సఖీ యోజన’లో ఉద్యోగాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

LIC Bima Sakhi Yojana : మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త.. ఎల్‌ఐసీ ‘బీమా సఖీ యోజన’లో ఉద్యోగాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2026,9:00 am

ప్రధానాంశాలు:

  •  LIC Bima Sakhi Yojana : మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త.. ఎల్‌ఐసీ ‘బీమా సఖీ యోజన’లో ఉద్యోగాలు..!

LIC Bima Sakhi Yojana : కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( LIC ) మహిళలకు( womens ) గొప్ప అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళల ఆర్థిక స్వావలంబనను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ‘బీమా సఖీ యోజన’ అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పని చేసే అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ పథకంలో ఎంపికైన మహిళలకు మూడేళ్ల పాటు శిక్షణతో పాటు నెలవారీ స్టైఫండ్ కూడా అందించనుంది ఎల్‌ఐసీ. శిక్షణ పూర్తయ్యాక వారు సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్లుగా కొనసాగవచ్చు .

LIC Bima Sakhi Yojana మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త ఎల్‌ఐసీ బీమా సఖీ యోజనలో ఉద్యోగాలు

LIC Bima Sakhi Yojana : మహిళలకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త.. ఎల్‌ఐసీ ‘బీమా సఖీ యోజన’లో ఉద్యోగాలు..!

LIC Bima Sakhi Yojana అర్హతలు, స్టైఫండ్ వివరాలు

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. కనీస విద్యార్హతగా పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఎంపికైన మహిళలకు మూడేళ్ల పాటు స్టైఫండ్ అందుతుంది. మొదటి ఏడాది నెలకు రూ.7,000, రెండో ఏడాది నెలకు రూ.6,000, మూడో ఏడాది నెలకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నారు. శిక్షణ కాలం పూర్తయ్యాక వారు సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా మారి కమిషన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు ప్రతిభ ఆధారంగా ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది.

LIC Bima Sakhi Yojana కమిషన్, నిబంధనలు మరియు దరఖాస్తు విధానం

బీమా సఖీ యోజనలో కమిషన్ పాలసీలపై ఆధారపడి ఉంటుంది. మొదటి నాలుగు నెలల్లో నెలకు రూ.2,000 వరకు తర్వాతి నాలుగు నెలల్లో రూ.4,000 వరకు, చివరి నాలుగు నెలల్లో నెలకు రూ.6,000 వరకు కమిషన్ పొందవచ్చు. ఈ విధంగా ఏడాదికి గరిష్టంగా రూ.48,000 వరకు కమిషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేస్తున్న మహిళలు, ఏజెంట్ల బంధువులు, మాజీ ఎల్‌ఐసీ ఏజెంట్లు ఈ పథకానికి అర్హులు కారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. వయస్సు, విద్యార్హత, చిరునామా వంటి వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ అధికారులు పరిశీలించిన తర్వాత ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. నెలనెలా స్టైఫండ్‌తో పాటు శిక్షణ కల్పించడం వల్ల బీమా రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే మహిళలకు ఈ పథకం ఒక మంచి అవకాశంగా నిలుస్తోంది .

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది