Good News : బ్రేకింగ్.. ఏపీలో సినిమా టికెట్ ధరలపై గుడ్ న్యూస్…?
Good News : ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా దృష్టి సారిస్తుంది. సినిమా టికెట్ ధరల విషయంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చిన నేపధ్యంలో దీనికి సంబంధించి మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసారు. నేడు వెలగపూడి సచివాలయంలో సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిటీ సమావేశం జరుగుతున్న నేపధ్యంలో దీనిపై ఆసక్తి పెరుగుతుంది.
నేడు నేరుగా ఉదయం 11.30కు సమావేశం నిర్వహిస్తారు. టికెట్ రేట్లపై ఇవాళ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. 3 వ సమావేశం కావడం తో కమిటీ ప్రతిపాదనలు నేడు ఫైనల్ చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కమిటీ నివేదికను కోర్టుకు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. హోమ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వం లో 13 మందితో కమిటీ సమావేశం నిర్వహిస్తారు.
కమిటీ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ రాందాస్, వేమూరి బలరత్నం… ఎగ్జిబిటర్, వడ్డే ఓం ప్రకాష్ ,CBFC మెంబర్ గంపా లక్ష్మీ, ప్రేక్షకుల సంఘం ఇతర సభ్యులు హాజరు అయ్యే అవకాశం ఉంది. గత సమావేశంలో బి,సి సెంటర్లలో రేట్లను మార్పు, థియేటర్లలో వసతులు, ఫైర్ నిబంధనలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఫుడ్ అధిక రేట్లకు అమ్మడం,టాయిలెట్స్ మయింటెన్స్ పైన నేడు మరో సారి చర్చ జరగనుంది.