Good News : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది కామన్‌గా మారింది. వయస్సు భారం పెరిగాక చాలా మంది ఉద్యోగం చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో లైఫ్ పక్కా ప్లాన్ చేసుకునేందుకు పెన్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది చివరి వయసులో ఆర్థిక సమస్యలని ఎదుర్కొంటారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అందుకే ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి. అందుకోసం తప్పకుండ మీరు దీని కోసం తెలుసుకోవాలి. పైగా ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అదే ప్రధాన్ మంత్రి వయ వందన యోజన. కచ్చితమైన పెన్షన్ ఈ స్కీమ్ తో పొందొచ్చు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ కి సంబంధించి బాధ్యత తీసుకుంటోంది. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వడ్డీ మార్చి 31 తర్వాత మారే అవకాశం వుంది. అందుకే ముందుగానే చేరితే 7.4 శాతం వడ్డీని పొందొచ్చు. ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్స్ మాత్రమే చేరాలి. ఇందులో చేరితే ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల చొప్పున పెన్షన్ పొందొచ్చు.
ఇందులో నెలవారీని ఎంచుకుంటే 7.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. అదే మూడు నెలలు అయితే 7.45 శాతం, ఆరు నెలలు అయితే 7.52 శాతం వస్తుంది. ఏడాది అయితే 7.66 శాతం చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది. 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు పెట్టచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.9250 పెన్షన్ వస్తుంది.ఇందులో మరో చక్కని అవకాశం కూడా ఉంది. భార్య భర్తలు ఇద్దరు చేరితే రూ.18 వేలకు పైగా పొందే అవకాశం ఉంది. డబ్బులు ఇన్వెస్ట్ చేసినవారు మరణిస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.