Good News : నెల‌కు ప‌దివేల రూపాయ‌ల పెన్ష‌న్.. ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : నెల‌కు ప‌దివేల రూపాయ‌ల పెన్ష‌న్.. ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :28 March 2022,2:30 pm

Good News : ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్కరికి పెన్ష‌న్ అనేది కామ‌న్‌గా మారింది. వ‌య‌స్సు భారం పెరిగాక చాలా మంది ఉద్యోగం చేయ‌లేకపోతున్నారు. ఈ క్రమంలో లైఫ్ ప‌క్కా ప్లాన్ చేసుకునేందుకు పెన్ష‌న్ అనేది చాలా ఉప‌యోగ‌పడుతుంది. చాలా మంది చివరి వయసులో ఆర్థిక సమస్యలని ఎదుర్కొంటారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అందుకే ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేయాలి. అందుకోసం త‌ప్పకుండ మీరు దీని కోసం తెలుసుకోవాలి. పైగా ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. అదే ప్రధాన్ మంత్రి వయ వందన యోజన. కచ్చితమైన పెన్షన్ ఈ స్కీమ్ తో పొందొచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ కి సంబంధించి బాధ్యత తీసుకుంటోంది. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల వరకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో 2023 మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వడ్డీ మార్చి 31 తర్వాత మారే అవకాశం వుంది. అందుకే ముందుగానే చేరితే 7.4 శాతం వడ్డీని పొందొచ్చు. ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్స్‌ మాత్రమే చేరాలి. ఇందులో చేరితే ఏడాది, ఆరు నెలలు, మూడు నెలలు, నెల చొప్పున పెన్షన్ పొందొచ్చు.

Good News plan pension in particular way

Good News plan pension in particular way

Good News : మంచి అవ‌కాశం త‌ప్పక వినియోగించుకోండి..

ఇందులో నెల‌వారీని ఎంచుకుంటే 7.4 శాతం వడ్డీ వర్తిస్తుంది. అదే మూడు నెలలు అయితే 7.45 శాతం, ఆరు నెలలు అయితే 7.52 శాతం వస్తుంది. ఏడాది అయితే 7.66 శాతం చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది. 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు పెట్టచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.9250 పెన్షన్ వస్తుంది.ఇందులో మ‌రో చ‌క్క‌ని అవ‌కాశం కూడా ఉంది. భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రు చేరితే రూ.18 వేల‌కు పైగా పొందే అవ‌కాశం ఉంది. డబ్బులు ఇన్వెస్ట్ చేసినవారు మరణిస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది