Andhra Pradesh : ఏపీ ప్రత్యేక హోదాకి సంబంధించి గుడ్ న్యూస్..?
Andhra Pradesh ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అందనీ ద్రాక్ష మాదిరిగానే ఉన్న సంగతి తెలిసిందే. యువజన చట్ట ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావలసిన గాని… కేంద్రం మాత్రం ఇవ్వలేదు. అయితే ప్రత్యేక హోదాకి బదులు చంద్రబాబు హయాంలో స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినట్లు కేంద్ర పెద్దలు వ్యాఖ్యలు ఇస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యయమని మరి కొంతమంది అంటున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా విషయంలో పట్టు వదలని చక్రవర్తి మాదిరిగా.. అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంకి వినతి పత్రాలు అందిస్తూ వస్తున్నారు.
రాష్ట్రానికి కేంద్ర పెద్దలు వచ్చినా లేదా జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన గాని… రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావలసిన స్పెషల్ స్టేటస్ కీ సంబంధించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ తరహా లోనే తాజాగా బుధవారం ఢిల్లీ పర్యటన చేపట్టిన జగన్ ఆరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కావడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రావలసిన నిధులు ఇంకా గతంలో కేంద్రం నుండి అదనంగా రావలసిన నిధులు పై చర్చించడం జరిగింది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా గురించి కూడా అమిత్ షా తో చర్చలు జరపగా…
కొద్దిగా సానుకూలంగా ఏదో ఓకే అన్నట్లు లేటెస్ట్ గా ప్రచారం జరుగుతుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ జీడీపీ వృద్ధి రేటు… అత్యధికంగా నమోదు అవుతున్న క్రమంలో … ఆర్థిక కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తే మరింతగా వృద్ధి సాధించే అవకాశం ఉంటుందని ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతి రైతు అత్యధికంగా రాష్ట్రంలో నమోదు అవుతున్న క్రమంలో దేశంలో అతిపెద్ద కుబేరులు అనిల్ అంబానీ ఇంకా చాలా మంది జగన్ నాయకత్వాన్ని బలంగా నమ్ముతూ ఉండటంతో… ప్రత్యేక హోదా ఇస్తే కచ్చితంగా ఇండస్ట్రీ పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నారట. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర పెద్దలు ఆలోచనలు మార్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.