SBI : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంకు అంటేనే అదో నమ్మకం. ఈ దేశ ప్రజలు ఎస్బీఐ బ్యాంకును నమ్మినంతగా ఏ బ్యాంకును నమ్మరు. అలాగే.. ఈ బ్యాంకుకు ఉన్న కస్టమర్లు.. మరే బ్యాంకుకు లేరు. ప్రపంచంలోనే ఈ బ్యాంకుకు ఎంతో గుర్తింపు ఉంది. ఆ బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన కస్టమర్లకు తాజాగా బ్యాంకు శుభవార్తను అందించింది. ఎస్బీఐ టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు.. వడ్డీ రేట్లను పెంచింది.
సాధారణంగా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు ఉంది. దాన్ని తాజాగా 75 పాయింట్లకు పెంచింది. ఇది టర్మ్ డిపాజిట్ పై వడ్డీ రేటు. అలాగే.. రిటైల్ టర్మ్ డిపాజిట్ పై కూడా వడ్డీ రేటును బ్యాంకు పెంచింది. దానిపై వడ్డీ రేటును 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. నిజానికి.. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. బ్యాంకులు కూడా వడ్డీ రేటును పెంచాయి. అయితే.. బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ పై కూడా వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది.
సాధారణంగా డిపాజిట్లపై ఇప్పుడు ఇచ్చే వడ్డీ రేటు 2.90 శాతం. కానీ.. 2 కోట్ల కంటే తక్కువ రిటైల్ టర్మ్ డిపాజిట్ ఉంటే మాత్రం దానిపై గరిష్టంగా 5.50 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే వడ్డీ రేటు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే.. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న రిటైల్ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా బ్యాంకు పెంచింది. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న జాతీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లకు పెంచారు.
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
This website uses cookies.