SBI : ఎస్బీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎగిరి గంతేసే శుభవార్త | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

SBI : ఎస్బీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఎగిరి గంతేసే శుభవార్త

SBI : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంకు అంటేనే అదో నమ్మకం. ఈ దేశ ప్రజలు ఎస్బీఐ బ్యాంకును నమ్మినంతగా ఏ బ్యాంకును నమ్మరు. అలాగే.. ఈ బ్యాంకుకు ఉన్న కస్టమర్లు.. మరే బ్యాంకుకు లేరు. ప్రపంచంలోనే ఈ బ్యాంకుకు ఎంతో గుర్తింపు ఉంది. ఆ బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన కస్టమర్లకు తాజాగా బ్యాంకు శుభవార్తను అందించింది. ఎస్బీఐ టర్మ్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :19 June 2022,6:00 pm

SBI : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బ్యాంకు అంటేనే అదో నమ్మకం. ఈ దేశ ప్రజలు ఎస్బీఐ బ్యాంకును నమ్మినంతగా ఏ బ్యాంకును నమ్మరు. అలాగే.. ఈ బ్యాంకుకు ఉన్న కస్టమర్లు.. మరే బ్యాంకుకు లేరు. ప్రపంచంలోనే ఈ బ్యాంకుకు ఎంతో గుర్తింపు ఉంది. ఆ బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన కస్టమర్లకు తాజాగా బ్యాంకు శుభవార్తను అందించింది. ఎస్బీఐ టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు.. వడ్డీ రేట్లను పెంచింది.

సాధారణంగా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు ఉంది. దాన్ని తాజాగా 75 పాయింట్లకు పెంచింది. ఇది టర్మ్ డిపాజిట్ పై వడ్డీ రేటు. అలాగే.. రిటైల్ టర్మ్ డిపాజిట్ పై కూడా వడ్డీ రేటును బ్యాంకు పెంచింది. దానిపై వడ్డీ రేటును 15 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెంచింది. నిజానికి.. ఇటీవల రిజర్వ్ బ్యాంకు రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. రెపో రేటును ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో.. బ్యాంకులు కూడా వడ్డీ రేటును పెంచాయి. అయితే.. బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ పై కూడా వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచింది.

good news to sbi fixed deposit customers

good news to sbi fixed deposit customers

SBI : ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న కనీస వడ్డీ రేటు ఎంతంటే?

సాధారణంగా డిపాజిట్లపై ఇప్పుడు ఇచ్చే వడ్డీ రేటు 2.90 శాతం. కానీ.. 2 కోట్ల కంటే తక్కువ రిటైల్ టర్మ్ డిపాజిట్ ఉంటే మాత్రం దానిపై గరిష్టంగా 5.50 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే వడ్డీ రేటు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే.. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న రిటైల్ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును కూడా బ్యాంకు పెంచింది. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న జాతీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లకు పెంచారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది