ఏపీ ప్రభుత్వం నేడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్ట బోతోంది. అగ్రవర్ణ మహిళల సంక్షేమమే ధ్యేయంగా.. వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రూపకల్పన చేసిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నేడు ప్రారంభించనున్నారు. నేడు వర్చువల్‌గా జరగనున్న ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నారు.
ఇక ఈ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం అర్హులైన మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలను ఆర్థిక సాయంగాజమ చేయనుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులుకాగా.. రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్య వైశ్య, వెలమ.. ఇతర అగ్ర కులాల మహిళలలు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందనున్నారు.
ఇలా రాష్ట్రంలోని మొత్తం 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఇక మేనిఫెస్టోలో ముందుగా ఈ పథకాన్ని పెట్టకపోయినా… రాష్ట్రం లోని అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు ఆర్థిక భరోసాగా నిలవడానికి తనవంతు సాయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.
Game Changer Movie : గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గేమ్…
Farmers : రైతులకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జనవరి 8న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నం మరియు అనకాపల్లిలో గ్రీన్…
Dammunte Pattukora Song : హైదరాబాద్లోని సంధ్యాథియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం అల్లు…
షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకొనుటకు, ఈ నీరు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ నీరు వల్ల ఎన్ని ఆరోగ్య…
Allu Arjun : పుష్ప 2 హిట్ ఏమో కానీ అల్లు అర్జున్ ని పూర్తిగా కార్నర్ చేసేలా పరిస్థితులు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క గమనమే వారి వారి జీవితాలను నిర్దేశిస్తుంది. ప్రస్తుతం నీచ స్థానంలో…
Fenugreek Water : మనం రోజు తినే ఆహార పదార్థంలో మెంతికూరను కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏంటి కూరను…
This website uses cookies.