Good News : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే వారి ఖాతాల్లోకి రూ. 15 వేలు..!
ఏపీ ప్రభుత్వం నేడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్ట బోతోంది. అగ్రవర్ణ మహిళల సంక్షేమమే ధ్యేయంగా.. వారికి మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రూపకల్పన చేసిన వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నేడు ప్రారంభించనున్నారు. నేడు వర్చువల్‌గా జరగనున్న ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నారు.
ఇక ఈ పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం అర్హులైన మహిళల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలను ఆర్థిక సాయంగాజమ చేయనుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు పేద అగ్రవర్ణ మహిళలు ఈ పథకానికి అర్హులుకాగా.. రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్య వైశ్య, వెలమ.. ఇతర అగ్ర కులాల మహిళలలు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందనున్నారు.

Good News ys Jagan going to start YSR EBC scheme today
ఇలా రాష్ట్రంలోని మొత్తం 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు రూ.589 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఇక మేనిఫెస్టోలో ముందుగా ఈ పథకాన్ని పెట్టకపోయినా… రాష్ట్రం లోని అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలకు ఆర్థిక భరోసాగా నిలవడానికి తనవంతు సాయంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.