Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌ లీక్స్.. తెరవెనుక అసలేం జరిగింది.?

Gorantla Madhav : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవడానికి కారణం, ఆయనదిగా చెప్పబడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే. ఆ వీడియోలో గోరంట్ల మాధవ్ నగ్నంగా కనిపిస్తున్నమాట వాస్తవం. దాంతో, క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో నిజమా.? కాదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఎందుకంటే, ఈ రోజుల్లో మార్ఫింగ్ అనేది చాలా సాధారణమైన విషయమైపోయింది. మొబైల్ ఫోన్లలో రకరకాల యాప్స్ ద్వారా మార్ఫింగ్ చేయడానికి వీలవుతోంది. అయితే, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు.? అన్నదే చర్చ ఇక్కడ.

2019 ఎన్నికలకు ముందు ఆయన పోలీస్ అధికారిగా వుండేవారు. అప్పట్లో టీడీపీ ఎంపీగా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డితో గోరంట్ల మాధవ్‌కి ఓ విషయమై వాగ్యుద్ధం జరిగింది. ‘బస్తీ మే సవాల్..’ అంటూ జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీస్ యూనిఫామ్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. తదనంతరం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ రంగంలోకి దిగారు. అంతకు ముందు ఆయన పదవీ విరమణ చేసేందుకోసం ప్రయత్నిస్తే, టీడీపీ సర్కారు అడ్డుపడినా, చివరికి గోరంట్లదే పై చేయి అయ్యింది. అప్పటినుంచీ, జేసీ దివాకర్ రెడ్డి అనుచరవర్గం అదను కోసం ఎదురుచూస్తూనే వచ్చింది.

Gorantla Madhav Leaks, The Actual Secret Behind.!

దాంతో, టీడీపీకి చెందినవారే ఈ నకిలీ వీడియో రూపొందించారా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ఈ ఘటనపై నిజానిజాలు తెలుసుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దించారు వైసీపీ అధినేత, సీఎం జగన్. వీడియోలో వున్నది మాధవ్ అని తేలితే చర్యలుంటాయని సజ్జల హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. ఈ వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతమైన పొలిటికల్ హీట్‌ని రగిల్చిందనేది కాదనలేని వాస్తవం.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

7 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

8 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

10 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

12 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

14 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

16 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

17 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

18 hours ago