Gorantla Madhav : గోరంట్ల మాధవ్ లీక్స్.. తెరవెనుక అసలేం జరిగింది.?
Gorantla Madhav : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవడానికి కారణం, ఆయనదిగా చెప్పబడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే. ఆ వీడియోలో గోరంట్ల మాధవ్ నగ్నంగా కనిపిస్తున్నమాట వాస్తవం. దాంతో, క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో నిజమా.? కాదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఎందుకంటే, ఈ రోజుల్లో మార్ఫింగ్ అనేది చాలా సాధారణమైన విషయమైపోయింది. మొబైల్ ఫోన్లలో రకరకాల యాప్స్ ద్వారా మార్ఫింగ్ చేయడానికి వీలవుతోంది. అయితే, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాత్రమే ఎందుకు టార్గెట్ అయ్యారు.? అన్నదే చర్చ ఇక్కడ.
2019 ఎన్నికలకు ముందు ఆయన పోలీస్ అధికారిగా వుండేవారు. అప్పట్లో టీడీపీ ఎంపీగా పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డితో గోరంట్ల మాధవ్‌కి ఓ విషయమై వాగ్యుద్ధం జరిగింది. ‘బస్తీ మే సవాల్..’ అంటూ జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీస్ యూనిఫామ్ మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. తదనంతరం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గోరంట్ల మాధవ్ రంగంలోకి దిగారు. అంతకు ముందు ఆయన పదవీ విరమణ చేసేందుకోసం ప్రయత్నిస్తే, టీడీపీ సర్కారు అడ్డుపడినా, చివరికి గోరంట్లదే పై చేయి అయ్యింది. అప్పటినుంచీ, జేసీ దివాకర్ రెడ్డి అనుచరవర్గం అదను కోసం ఎదురుచూస్తూనే వచ్చింది.
దాంతో, టీడీపీకి చెందినవారే ఈ నకిలీ వీడియో రూపొందించారా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ఈ ఘటనపై నిజానిజాలు తెలుసుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలోకి దించారు వైసీపీ అధినేత, సీఎం జగన్. వీడియోలో వున్నది మాధవ్ అని తేలితే చర్యలుంటాయని సజ్జల హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. ఈ వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతమైన పొలిటికల్ హీట్‌ని రగిల్చిందనేది కాదనలేని వాస్తవం.