Government Scheme : ఈ స్కీం లో నెలకు రూ.55 కడితే… సంవత్సరానికి 36 వేల పెన్షన్ పొందవచ్చు…
Government Scheme : పేదలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా తోడుండాలని ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. అయితే పేద కార్మికులు, కూలీలు ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ పెన్షన్ పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ ఫండ్ పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో చేరిన వారికి కనీస హామీ పెన్షన్ నెలకు రూ.3000 చెల్లిస్తారు. నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే సంవత్సరానికి 36వేల పెన్షన్ పొందే వీలుంటుంది. ఎక్కువ ప్రీమియం కడితే సంవత్సరానికి 72,000 కూడా ఈ పథకం నుంచి పొందవచ్చు. పిఎంఎస్ వైఎం లోని ప్రతి సభ్యునికి 60 ఏళ్ల వయసు దాటాక తర్వాత నెలకు రూ.3000 చొప్పున పెన్షన్ ఇస్తారు. దాని ప్రకారం ఒక వ్యక్తి సంవత్సరానికి 36000 పెన్షన్ గా పొందవచ్చు. వయసును బట్టి ప్రీమియం ఉంటుంది.
ఈ పథకాన్ని పొందుతున్న సమయంలో ఖాతాదారులు మరణించినట్లయితే జీవిత భాగస్వామి పెన్షన్లు సగం మొత్తాన్ని కుటుంబ పెన్షన్ గా పొందేందుకు వీలుంటుంది. కుటుంబ పెన్షన్ కు జీవిత భాగస్వామి మాత్రమే అర్హులు. చందా దారుడు ఏ కారణం చేతనైనా 60 ఏళ్ళు నిండకముందే శాశ్వతంగా వికలాంగుడు అయితే జీవిత భాగస్వామి ద్వారా ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం తో పాటు పెన్షన్ ఫండ్ ద్వారా వచ్చిన వడ్డీని తీసుకోవచ్చు. ఈ పథకాన్ని ఎవరు అర్హులు అంటే 18 ఏళ్లు ఉన్నవారు నెలకు 55 చెల్లించాలి. ప్రభుత్వం కూడా సమానమైన మొత్తాన్ని చెల్లిస్తుంది. నెలకు గరిష్టంగా 200 చెల్లించిన ప్రభుత్వం దానికి సమానమైన మొత్తాన్ని చెల్లిస్తుంది. 40 ఏళ్లకు మించిన వాళ్లు ఈ పథకానికి అర్హులు కారు.
ఈ పథకానికి ఇంటి పని వాళ్లు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, లోడింగ్ చేసేవారు, ఇటుక కార్మికులు, చెప్పులు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు, చాకలి వారు, రిక్షా తొక్కేవాళ్లు, భూమిలేని కార్మికులు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు తదితర పనులు చేసే వాళ్ళు అర్హులు. ఇంకొక షరతు ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా కొత్త పెన్షన్స్ స్కీం ద్వారా ప్రయోజనాలు పొందకూడదు. ఆదాయపు పన్నులు చెల్లించకూడదు. నెలవారి ఆదాయం 15000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఆధార్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నెంబర్ తో సెల్ఫ్ వెరిఫికేషన్ ఆధారంగా సమీప సీపీఎస్ లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.