Government Scheme : రేషన్ కార్డ్ ఉంటేనే ఆ స్కీమ్ వర్తిస్తుందా…? లేకపోతే డబ్బులు రావా..?
ప్రధానాంశాలు:
Government Scheme : రేషన్ కార్డ్ ఉంటేనే ఆ స్కీమ్ వర్తిస్తుందా...? లేకపోతే డబ్బులు రావా..?
Government Scheme : మనం కొన్ని రకాల స్కీములను పొందాలంటే రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైనది. రేషన్ కార్డు తో పాటు పాన్ కార్డు ఆధార్ కార్డు లాంటి ముఖ్యమైన కార్డ్స్ కూడా కావాలి. వీటిలో ఎటువంటి కార్డు లేకపోయినా కొన్ని రకాల స్కీములు గురించి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఈ అన్ని కార్డులలో వివరాలు కచ్చితంగా ఉన్నాయా.. లేవా.. అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే ముందు రోజులలో కొన్ని స్కీములకు ఈ కార్డులు ఉండే వివరాలు అన్నిట్లో ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కార్డుల గురించి ఎందుకని ఆలోచిస్తున్నారా..? తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. వీటిలో రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం చెప్పింది.
అలాగే ఆధార కార్డు కూడా తప్పనిసరి. అయితే ఆధార్ కార్డులో వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. లేదంటే కొన్ని స్కీముల బెనిఫిట్స్ మిస్ అవ్వటం ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ చాలా సంవత్సరాల కిందటనే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు చాలామంది దానికోసం ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఈ రేషన్ కార్డు లేక ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను పొందలేకపోతున్నారు.. అయితే గృహ జ్యోతి స్కీం కింద అప్పటికే ఉచిత విద్యుత్తు పథకం అమలులోకి రావడం లేదు. ఈ పథకం కోసం పలు మెలికలు పెట్టారు. దీని వలన చాలా మంది పై ప్రభావం చూపుతోంది. 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే వారికి తెల్ల రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పింది.గత సంవత్సరంలో చేసిన వినియోగాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ప్రకటిస్తుంది. దీని వల్ల చాలా మందికి రేషన్ కార్డులు రాకపోవచ్చు.
అలాగే కరెంటు బిల్లులు బకాయి ఉన్న వినియోగదారులు కూడా గృహజ్యోతి పథకం అమలు కాదని ప్రభుత్వం చెప్తుంది. బకాయి చెల్లించిన తర్వాతే ఈ స్కీములు వర్తిస్తాయని చెప్తున్నారు అధికారులు.
అలాగే 500 కి సిలిండర్ గ్యాస్ పొందాలని అనుకునేవారు రేషన్ కార్డు సమర్పించకపోతే మాత్రం ఎటువంటి డబ్బు పొందలేరట. అంటే సిలిండర్ సబ్సిడీ డబ్బులు వీరి అకౌంట్లోకి పడవు.. అదేవిధంగా 2022- 23 సంవత్సరంలో వినియోగదారుడు నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం వస్తే ఈ పథకం వర్తించదని చెప్తున్నారు. అంటే జీరో బిల్లులు ఇవ్వరు. కచ్చితంగా వారు డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా గృహ జ్యోతి పథకంగా ఎంపికైన 200 పైగా విద్యుత్తు వినియోగిస్తే పూర్తి బిల్లు చెల్లించవలసిందే…