ChandraBabu : ఇలాంటప్పుడు మాత్రమే ‘ఎన్టీఆర్’ గుర్తు వస్తాడు చంద్రబాబుకి ..
ChandraBabu : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పార్టీ మహానాడు ను భారీ ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహా నటుడు ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలంటూ మహానాడు లో తీర్మానం చేయడం జరిగింది. ఇంకా ఎన్టీఆర్ గురించి మహానాడులో ప్రతి ఒక్కరు ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎన్టీఆర్ ని ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది
అంటూ వైకాపా నాయకుడు ప్రభుత్వ విప్ ఉదయభాను మండిపడ్డాడు.40 ఏళ్లు నిండిన టిడిపి సభలో ఎన్టీఆర్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశాడు. కేవలం ఇలాంటి సమయాల్లో మరియు సందర్భాల్లో మాత్రమే ఎన్టీఆర్ పేరు ను చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తు చేసుకుంటారు.. ఇతర సందర్భాల్లో ఆయనకు ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకు రారు అంటూ ఉదయభాను ప్రశ్నించారు. ఎన్టీఆర్ యొక్క పేరును ప్రస్తావించే హక్కు చంద్రబాబు నాయుడు కు ఉందా అనే విషయాన్ని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఒకసారి ఆలోచించాలి అంటూ ఉదయభాను సూపించాడు.
ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ యొక్క గొప్పతనం గుర్తు వస్తుంది.. కానీ మా అధినేత జగన్ మాత్రం చంద్రబాబునాయుడు యొక్క తీరు కి పూర్తి విరుద్ధం ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయిన కూడా ఎన్టీఆర్ యొక్క పేరును ఒక జిల్లాకు పెట్టడంతో పాటు ఆయనకు సముచిత స్థానం కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన గొప్ప వ్యక్తి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటూ ఉదయభాను పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులకు ఏ ఒక్కరికి కూడా ఎన్టీఆర్ యొక్క పేరును ప్రస్తావించే అర్హత లేదని, వారు ఆయన్ని చంపేసి ఇప్పుడు ఆయన గురించి కల్లబొల్లి మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఉదయభాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.