GVL Narasimha Rao : వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు..!!
GVL Narasimha Rao : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి కృషి చేస్తున్నట్లు ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మొన్న మధ్య.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం లేదని కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై BRS నేతలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ పోరాటం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగిందని.. ఈ విషయంలో ఏపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని వైరల్ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆ తర్వాత రోజే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని కేంద్రం ప్రకటించడం అందరికీ షాక్ ఇచ్చినట్లయింది. అయితే ఈ విషయంపై ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిపోవటానికి ప్రధాన కారణం అంతకు ముందు ప్రభుత్వాలని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో… స్టీల్ ప్లాంట్ గురించి సరిగ్గా పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు నష్టాల్లోకి వెళ్లిపోయిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడంలో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేయదని జీవీఎల్ నరసింహారావు కరాకండిగా చెప్పేశారు. అయితే ఇది లాంగ్ ప్రాసెస్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎదగక పోవడానికి ప్రధాన కారణం కొన్ని మీడియా సంస్థలు. అయినా గాని ప్రజల కోసం తమ వంతు కృషి చేసి పోరాడుతున్నామని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.