Happy Married Life : నమ్మకం పునాది లాంటిది… అది లేని చోట బంధాలు నిల్వవు…? జీవిత రహస్యాలు మీకోసం…?
Happy Married Life : ప్రపంచంలో ఏ బంధమైనా నమ్మకంతోనే బలపడుతుంది.అలాంటి నమ్మకం కుటుంబంలోనైనా, స్నేహితుల మధ్య అయినా, భార్యాభర్తల మధ్యనైనా నమ్మకం ఒక పునాదిలా ఉండాలి.అది లేనిచో బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి. ఒకరికి పై ఒకరికి ప్రేమ, గౌరవం, నమ్మకం, క్షమ, సానుభూతి వంటి విలువలతో నిండిన అనుబంధం కావాలి. ఎందుకో సద్గురు ఇచ్చిన మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ విలువలో జీవిత భాగస్వాముల మధ్య బంధాన్ని బలపరచడమే కాకుండా.. జీవితాన్ని సంతోషంగా జీవించడానికి ఉపయోగపడతాయి. వివాహం కేవలం సాంప్రదాయ సంబంధం మాత్రమే కాదు.. దీని గురించి సద్గురు ఏం చెప్పారు తెలుసుకుందాం… వివాహం అనేది మన జీవితానికి ఒక తోడు కావాలని నిర్ణయించుకోవడం. శారీరక,భావోద్వేగా,మానసిక,ఆర్థిక, సామాజిక అవసరాలను పూరించగల వ్యక్తి జీవిత భాగస్వామిగా ఉండాలి. బంధం నిచ్చలంగా నిలవాలంటే దానికి శ్రద్ధ అవసరం. అందమైన రోజురోజుకు మారుతూ ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేస్తే దూరమవుతుంది. కాబట్టి మన జీవిత భాగస్వామితో అనుబంధాన్ని ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవాలి.

Happy Married Life : నమ్మకం పునాది లాంటిది… అది లేని చోట బంధాలు నిల్వవు…? జీవిత రహస్యాలు మీకోసం…?
మంచి వివాహ బంధానికి ముఖ్యమైన అంశం సంభాషణ. మనసులో ఉన్న విషయాలను బహిరంగ చెప్పుకోవడం ద్వారా భావోద్వేగాలు సమతుల్యతలో ఉంటాయి. ఇది ఇద్దరినీ దగ్గర చేస్తుంది. అలాగే ఒకరినొకరు గౌరవించడం కూడా ఎంతో అవసరం. వివాహం వల్ల మన వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన పనిలేదు. ప్రతి వ్యక్తికి తన సొంత అభిప్రాయాలు ఉంటాయి. అవి భిన్నంగా ఉన్నా గౌరవించాలి. ఆ గౌరవం బంధాన్ని నిలబెట్టే శక్తిగా ఉంటుంది. ఇక నమ్మకం గురించి చెప్పాలంటే.. లేకుంటా ఎలాంటి సంబంధం నిలవదు. భార్యాభర్తల మధ్య పరస్పర నమ్మకం పెరిగేలా మాట్లాడుకోవాలి. ఒకరి నమ్మకాన్ని మరొకరు దెబ్బతీయకుండా జాగ్రత్త పడాలి. నమ్మకం ఏ బంధాన్ని బలంగా ఉంచుతుంది. ఇవాహం అనగా ఒకరి ప్రపంచంలో మరొకరికి కలిపేసుకోవడం కాదు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఎదిగే అవకాశం ఉండాలి. కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా బంధం మరింత ఆరోగ్యంగా మారుతుంది.
Happy Married Life : సద్గురు చెప్పిన వివాహ రహస్యాలు
మానవ సంబంధాలలో మనుషుల మధ్య అంచనాలు, అబద్ధాలు, సాధారణం. ఇప్పుడు క్షమించగలడం ఎంతో అవసరం. చిన్న సమస్యలను పట్టించుకోని బంధాన్ని బలహీనంగా మార్చుకోవద్దు. దిగతా లక్షణాలను అంగీకరించగలడం ద్వారా మన హృదయంలో దయ, ప్రేమ పెరుగుతుంది. మన భాగస్వామి లో ఉన్న అసంపూర్ణతను అంగీకరించగలడం ద్వారా జీవితం మరింత సులభంగా సాగుతుంది.
జీవిత భాగస్వామి చేసిన పనుల్ని బాధ్యతగా కాకుండా ప్రేమతో చూసుకోవాలి. మనకు చేయబడ్డ సహాయానికి కృతజ్ఞత చూపడం ద్వారా బంధం బలపడుతుంది. భార్య భర్తలు ఒకే ఇంట్లో ఉన్న.. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కలిసి గడపడం అవసరం. కలిసి విహారయాత్రలు, భోజనాలు, లేదా మంచి సమయాన్ని గడపడం ద్వారా ప్రేమ మరింత పెరుగుతుంది. ప్రయాణంలో నువ్వు ఎంతో కీలకమైనది. ఒకరితో ఒకరు నవ్వుతూ మాట్లాడుకోవడం వల్ల మధ్యలో ఉండే ఒత్తిళ్లు పోతాయి.ఈ విధంగా సాన్నిహిత్యం పెరుగుతుంది. సద్గురు చెప్పిన ఈ సూచనలు వివాహ బంధాన్ని ప్రేమతో, కాంతితో నింపడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ బంధం సాధారణంగా ఉండకూడదు అంటే, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే మనసుతో, పరస్పర గౌరవంతో క్షమించగల స్వభావంతో జీవించాలి. ఇలాంటి విలువలు ఉన్నప్పుడు మాత్రమే ఈ అనుబంధం బలంగా మారుతుంది.