Ys jagan : కష్ట కాలంలో జగన్ చేసిన పనికి హ్యాట్సాఫ్
Ys Jagan : దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కేసులు పెరగటమే కాకుండా మృతులు సంఖ్య మొన్నటికి మొన్న దాదాపు 100 దాక చేరుకోవటం చూస్తే పరిస్థితిలు చేజారిపోతున్నట్లు సృష్టంగా తెలుస్తుంది. మృతుల సంఖ్యపెరగటానికి పెరగటానికి ప్రధాన కారణం ఆక్సిజన్ కొరత అనే చెప్పాలి. యువకులు కూడా మహమ్మారి బారిన పడి ఊపిరి తీసుకోలేక ప్రాణాలు విడుస్తున్న వైనం చూస్తే గుండె తరుక్కుపోతుంది.
ఇకపై ఆక్సిజన్ లేక మనిషి ప్రాణాలు పోగొట్టు కునే పరిస్థితి రాకూడదనే ఆశయంతో జగన్ Ys jagan సర్కార్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు, 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం రూ.309.87 కోట్లు కేటాయిస్తూ వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్‌లైన్ల ఏర్పాటు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ కోసం జిల్లాకు రూ.10 లక్షల చొప్పున .. 6 నెలలకు రూ.60 లక్షలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ దిగుమతిని పరివేక్షించటానికి, అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ ఇంఛార్జ్‌గా స్పెషల్ సీఎస్ కరికాల వలవన్‌కు ప్రభుత్వం Ys jagan బాధ్యతలు అప్పగించింది. రోగుల ఆర్తనాధాలను విన్న జగన్ సర్కార్ …వెంటనే అప్రమత్తమై ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకోవడం ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటివరకు జరిగిన విషయాలు కాకుండా ఇక మీద రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ఎవరు ప్రాణాలు వదలుకూడదనే ఆశయంతో సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి మెచ్చుకొని తీరాల్సిందే..