HDFC Bank : హెచ్ డిఎఫ్ సి కస్టమర్లకు గుడ్ న్యూస్… ఇక అరగంటలోనే లోన్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

HDFC Bank : హెచ్ డిఎఫ్ సి కస్టమర్లకు గుడ్ న్యూస్… ఇక అరగంటలోనే లోన్…!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 October 2022,6:30 pm

HDFC Bank : పండుగ సందర్భంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన వినియోగదారులకు వివిధ రకాల సర్వీసులను అందిస్తుంది. బ్యాంకు తాజాగా పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లకు శుభవార్తను ప్రకటించింది. వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఆన్లైన్, ఆఫ్లైన్ డిస్కౌంట్లతో పాటుగా లోన్లపై కూడా తగ్గింపు అందిస్తుంది. కస్టమర్లకు ఎన్నో రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచింది. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి వాటిపై స్పెషల్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది.

ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. పర్సనల్ లోన్ పొందాలనుకునేవారు 40 లక్షల వరకు లోన్ పొందవచ్చు. వడ్డీ రేటు 10.5% నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే బిజినెస్ లోన్ పొందాలంటే ఎటువంటి తనిఖీ లేకుండా రుణాలు అందిస్తుంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజులో 50% తగ్గింపు అందుబాటులో ఉంచింది. అలాగే కార్ లోన్స్ పొందాలనుకుంటే కేవలం 30 నిమిషాల్లోనే రుణం పొందవచ్చు అని బ్యాంక్ తెలిపింది. వడ్డీ రేటు 7.9 శాతం నుంచి మొదలవుతుంది. అలాగే ఎలాంటి చార్జీలు ఉండవు. సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు చేయాలంటే వడ్డీ రేటు 10.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

HDFC bank offers the loans

HDFC bank offers the loans

రెండేళ్ల తర్వాత లోన్ క్లోజ్ చేసుకోవచ్చు, చార్జీలు ఉండవు. కారు, హోమ్, గోల్డ్ లోన్స్ పై భారీ ఆఫర్లు అందిస్తుంది బ్యాంక్. 50 లక్షల వరకు రుణాలను తక్కువ వడ్డీ రేటు కే పొందవచ్చు అని బ్యాంక్ తెలిపింది. అలాగే ప్రాపర్టీ మీద లోన్ తీసుకునే వారికి ఫ్లాట్ రూ.9999 ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కు స్పెషల్ ప్రాసెసింగ్ బెనిఫిట్ పొందవచ్చు. బ్యాంక్ పలు రకాల బ్రాండ్లతో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది. కస్టమర్లకు వివిధ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఫెస్టివల్ లో భాగంగా ఇతర బ్యాంకులు కూడా పండుగ ఆఫర్లు తీసుకొచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి కస్టమర్లకు కొన్ని రకాల బెనిఫిట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది