New Ration Cards : గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా రేషన్ కార్డులు
New Ration Cards : కూటమి ప్రభుత్వం ఇటీవల వరాలు ప్రకటిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం సమయంలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరికొంత మందిని కొత్త రేషన్ కార్డు అర్హుల జాబితాలోకి తీసుకొస్తున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వాళ్ల వివరాలు వెల్లడించారు.
New Ration Cards : వారికి గుడ్ న్యూస్..
రాష్ట్రంలోని ఒంటరి, లింగమార్పిడి అయిన వాళ్లకు కూడా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక ఈ నెల 15 నుంచి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వివాహం కాకుండా 50 ఏళ్లు దాటి ఒంటరిగా ఉంటున్న వాళ్లు.. ఆశ్రమాల్లో ఉంటున్న నిరాశ్రయులు.. అంతేకాక లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు కూడా కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మేరకు తెలిపారు.

New Ration Cards : గుడ్ న్యూస్.. ఇకపై వారికి కూడా రేషన్ కార్డులు
కళాకారులకు ఇకపై అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద ప్రతినెలా 35 కేజీల బియ్యం అందించనున్నట్లు వివరించారు. దుర్భల గిరిజన సమూహాలు (పీవీటీజీ) జాబితాలో ఉన్నవారికి కూడా అంత్యోదయ అన్న యోజన పథకం కింద బియ్యం ఇస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఏలూరు, అల్లూరి సీతారామరాజు వంటి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో నివసించే 12 కులాల గిరిజనులు, చెంచులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.2 లక్షల లోపు ఉండాలి.