Coriander | కొత్తిమీర జ్యూస్ తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా… మెరిసే అందం మీ సొంతం..!
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు, లేదా చట్నీ, జ్యూస్ రూపంలోనైనా దీనిని వాడుతారు. చాలా మందికి ఇది ఒక సాధారణ ఆకు కూరగానే అనిపించినా, నిజానికి కొత్తిమీర గడ్డి వర్గానికి చెందిన సువాసనగల ఔషధ మూలిక. నిత్యం ఆహారంలో కొత్తిమీరను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

#image_title
శరీరాన్ని చల్లబరుస్తుంది
కొత్తిమీర సహజ శీతలకారకంగా పనిచేస్తుంది. వేసవిలో కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల హీట్ స్ట్రోక్ నివారించవచ్చు. అలసటను తగ్గించడంతో పాటు శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. టీ, కాఫీకి ఇది మంచి ప్రత్యామ్నాయం.
చర్మానికి మేలు
కొత్తిమీర జ్యూస్ చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. తరచూ చర్మం పొడిబారిపోవడం, రాపిడి సమస్యలు ఉన్నవారు దీన్ని తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జీర్ణక్రియకు..
కొత్తిమీరలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కడుపు నొప్పి, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయకారి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కలిగి ఉంటాయి.
మధుమేహ నియంత్రణ
కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కొత్తిమీర తీసుకున్నప్పుడు కేవలం కొన్ని గంటల్లోనే రక్తంలో చక్కెర స్థాయులు గణనీయంగా తగ్గినట్లు తేలింది.