Soaked Fig Benefits | ఆరోగ్యానికి వరంగా అంజీర్ పండ్లు.. ప్రతి రోజు ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా?
Soaked Fig Benefits | బాదం, వాల్‌నట్స్, ఎండుద్రాక్షలతో పాటు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ జాబితాలో మరో ముఖ్యమైన పేరు అంజీర్ (Fig). మనదేశంలో కొంతమంది దీన్ని మర్చిపోతుంటారు గానీ, పోషకాలను దృష్టిలో పెట్టుకుంటే అంజీర్ పండ్లు ఓ సూపర్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ పండ్లను సాధారణంగా తినొచ్చు కానీ, రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

#image_title
1. మలబద్ధకం నుంచి ఉపశమనం
అంజీర్‌లో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగుల పనితీరును మెరుగుపరచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నానబెట్టిన అంజీర్ పండ్లను ఉదయాన్నే తినడం జీర్ణాశయానికి చాలా ఉపయోగపడుతుంది.
2. బరువు తగ్గాలనుకుంటున్నవారికి
ఈరోజుల్లో చాలామంది బరువు పెరుగుతామా అనే ఆందోళనలో ఉంటారు. అలాంటి వారికీ అంజీర్ మంచి సహాయం చేస్తుంది.
3. చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది
అంజీర్‌లో పొటాషియం మరియు క్లోరోజెనిక్ ఆమ్లం ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
4. ఎముకల బలానికి సహాయం
పాలు ఎంతగానో ఎముకలకు మంచివో, అదే విధంగా అంజీర్ పండ్లలో ఉండే కాల్షియం కూడా ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇది ఒస్టియోపోరోసిస్ వంటి సమస్యల నివారణలో కూడా దోహదపడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో 2 అంజీర్లను తినడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనం పొందవచ్చు.
5. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
అంజీర్‌లో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, యాంటీఆక్సిడెంట్లు కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో , గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువవుతుంది.