health benefits of sabja seeds in covid time
Sabja Seeds : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. గత సంవత్సరం ఉన్నంత భయం ఇప్పుడు లేకున్నా.. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి మన ఒంట్లో రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం. రోగనిరోధక శక్తి తక్కువైతేనే కరోనా లాంటి వైరస్ ను శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోగలిగితే చాలు… కరోనా కాదు కదా.. దాన్ని మించిన వైరస్ అయినా సరే… శరీరంలో ప్రవేశించలేదు.
health benefits of sabja seeds in covid time
అందుకే… కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం… సబ్జా గింజలు చాలా ఉత్తమంగా పనిచేస్తాయి. సబ్జా గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, వైసెనిన్, ఓరింటిన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.సబ్జా గింజల్లో ఉన్నన్ని ఔషధ గుణాలు మరే గింజల్లో ఉండవు. ఇవి చూడటానికి చిన్నగా నల్లగా ఉన్నా.. వీటిని నీటిలో వేసి నానబెడితే… తెల్లగా మారుతాయి.
ఒంట్లో వేడి ఎక్కువైతే శరీరంలో ఉన్న వేడిని సబ్జా గింజలు ఇట్టే తగ్గించేస్తాయి. అలాగే… మీకు తలనొప్పి వచ్చినా… ఒంట్లో నీరసంగా ఉన్నా…. కొన్ని సబ్జా గింజలను తీసుకొని వాటిని నీళ్లలో కలుపుకొని తాగేయండి.సబ్జా గింజల్లో ఉండే మరో మంచి గుణం ఏంటంటే.. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే శరీరంలో ఉన్న మలినాలను ఇవి తొలగించేస్తాయి.మలబద్ధక సమస్యలు ఉన్నా కూడా వీటిని రాత్రి పూట పాలల్లో కలుపుకొని తాగితే… మలబద్ధక సమస్య వెంటనే తగ్గుతుంది.
సబ్జా గింజలు షుగర్ ను కంట్రోల్ లో ఉంచేందుకు మంచి ఔషధంలా పనిచేస్తాయి. వారంలో ఒకరోజు సబ్జా గింజలతో చేసిన జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. బాడీలో షుగర్ లేవల్స్ ను పెరగకుండా ఇవి అదుపులో ఉంచుతాయి. అందుకే…. షుగర్ పేషెంట్లు… సబ్జా గింజలతో చేసిన జ్యూస్ ను అప్పుడప్పుడు తాగుతుండాలి.అయితే.. చిన్న పిల్లలకు సబ్జా గింజలతో చేసిన పానీయాలను తాగించకపోవడం మంచిది. ఎందుకంటే…. పిల్లలకు ఈ గింజలు సరిగ్గా అరగవు.. ఒకవేళ గింజలు పడకపోతే వాళ్లకు శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణులు కూడా సబ్జా గింజలను తినకపోవడమే మంచిది. గర్భిణుల్లో ఈస్ట్రోజోన్ లేవల్స్ ను పూర్తిగా తగ్గిస్తాయి. అందుకే గర్భిణులు సబ్జా గింజలకు దూరంగా ఉండటం మంచిది.
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
This website uses cookies.