Sabja Seeds : కరోనా టైమ్ లో ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్జా గింజలు మీ ఇంట్లో ఉండాల్సిందే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sabja Seeds : కరోనా టైమ్ లో ఇమ్యూనిటీని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్జా గింజలు మీ ఇంట్లో ఉండాల్సిందే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 April 2021,7:43 pm

Sabja Seeds : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. గత సంవత్సరం ఉన్నంత భయం ఇప్పుడు లేకున్నా.. కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి మన ఒంట్లో రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం. రోగనిరోధక శక్తి తక్కువైతేనే కరోనా లాంటి వైరస్ ను శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోగలిగితే చాలు… కరోనా కాదు కదా.. దాన్ని మించిన వైరస్ అయినా సరే… శరీరంలో ప్రవేశించలేదు.

health benefits of sabja seeds in covid time

health benefits of sabja seeds in covid time

అందుకే… కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం… సబ్జా గింజలు చాలా ఉత్తమంగా పనిచేస్తాయి. సబ్జా గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, వైసెనిన్, ఓరింటిన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.సబ్జా గింజల్లో ఉన్నన్ని ఔషధ గుణాలు మరే గింజల్లో ఉండవు. ఇవి చూడటానికి చిన్నగా నల్లగా ఉన్నా.. వీటిని నీటిలో వేసి నానబెడితే… తెల్లగా మారుతాయి.

ఒంట్లో వేడి ఎక్కువైతే శరీరంలో ఉన్న వేడిని సబ్జా గింజలు ఇట్టే తగ్గించేస్తాయి. అలాగే… మీకు తలనొప్పి వచ్చినా… ఒంట్లో నీరసంగా ఉన్నా…. కొన్ని సబ్జా గింజలను తీసుకొని వాటిని నీళ్లలో కలుపుకొని తాగేయండి.సబ్జా గింజల్లో ఉండే మరో మంచి గుణం ఏంటంటే.. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే శరీరంలో ఉన్న మలినాలను ఇవి తొలగించేస్తాయి.మలబద్ధక సమస్యలు ఉన్నా కూడా వీటిని రాత్రి పూట పాలల్లో కలుపుకొని తాగితే… మలబద్ధక సమస్య వెంటనే తగ్గుతుంది.

Sabja Seeds : షుగర్ ను కంట్రోల్ లో ఉంచేందుకు

సబ్జా గింజలు షుగర్ ను కంట్రోల్ లో ఉంచేందుకు మంచి ఔషధంలా పనిచేస్తాయి. వారంలో ఒకరోజు సబ్జా గింజలతో చేసిన జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. బాడీలో షుగర్ లేవల్స్ ను పెరగకుండా ఇవి అదుపులో ఉంచుతాయి. అందుకే…. షుగర్ పేషెంట్లు… సబ్జా గింజలతో చేసిన జ్యూస్ ను అప్పుడప్పుడు తాగుతుండాలి.అయితే.. చిన్న పిల్లలకు సబ్జా గింజలతో చేసిన పానీయాలను తాగించకపోవడం మంచిది. ఎందుకంటే…. పిల్లలకు ఈ గింజలు సరిగ్గా అరగవు.. ఒకవేళ  గింజలు పడకపోతే వాళ్లకు శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణులు కూడా సబ్జా గింజలను తినకపోవడమే మంచిది. గర్భిణుల్లో ఈస్ట్రోజోన్ లేవల్స్ ను పూర్తిగా తగ్గిస్తాయి. అందుకే గర్భిణులు సబ్జా గింజలకు దూరంగా ఉండటం మంచిది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది