Home » Andhra Pradesh » Ys Jagan Giving Importance To D Avinash
andhra pradesh

Ys Jagan : ఆ యంగ్ లీడ‌ర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్‌.. కార‌ణం అదేనా..?

Authored By
Himanshi
The Telugu News | Updated on: April 2, 2021, 6:45 pm
Advertisement

Ys Jagan : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయంగా పండి పోతున్నారు. సీఎం అవ్వక ముందు వరకు కూడా రాజకీయంలో పెద్దగా అనుభవం లేని వాడిగా కనిపించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పుడు మాత్రం రాబోయే ఎన్నికల కోసం అన్నట్లుగా ముందస్తు వ్యూహాలు పన్నుతున్నాడు. ప్రతి జిల్లాలో కూడా ఇప్పటి నుండే ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లీడర్లను పెంచి పోషిస్తున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కృష్ణా జిల్లాలో వైకాపాను మరింత బలోపేతం చేసేందుకు కమ్మ సామాజిక వర్గంకు చెందిన బలమైన నాయకుడు ఎంతైనా అవసరం. యువ నాయుడు మరియు కమ్మ సామాజిక వర్గంకు చెందిన నాయుడుకు వైకాపాలో ఉంటే ఖచ్చితంగా కృష్ణ జిల్లాలో ముందు ముందు అద్బుతమైన ఫలితాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. అందుకే కమ్మ సామాజిక వర్గంకు చెందిన అవినాష్‌ ను వైఎస్‌ జగన్‌ మోమన్‌ రెడ్డి వాడేస్తున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Devineni Avinash‌ : అవినాష్‌ పై చాలా నమ్మకం

బలమైన రాజకీయ వారసత్వం ఉన్న దేవినేని అవినాష్‌ ప్రస్తుతం వైకాపాలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నాడు. కృష్ణా జిల్లాలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా సీఎంతో పాటు దేవినేని అవినాష్‌ పేరు ఉంటుంది. కృష్ణా జిల్లాలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేకంగా అవినాష్‌ ను పక్కన ఉంచుకుంటున్నట్లుగా కూడా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న ఒక నాయకుడు ఇటీవల మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అవినాష్‌ పై చాలా నమ్మకం ఉంది. అతడు మంచి భవిష్యత్తు ఉన్న లీడర్‌ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీన్ని బట్టి అవినాష్‌ కు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ys jagan mohan reddy

Ys Jagan : కమ్మ సామాజిక వర్గంకు చెందిన దేవినేని అవినాష్….

కృష్ణా జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో అవినాష్‌ కు మాత్రమే వైకాపా ప్రాముఖ్యత ఇస్తుందని అంటున్నారు. కొందరు సీనియర్‌ నాయకులు ఉన్నా కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం కమ్మ సామాజిక వర్గంకు చెందిన దేవినేని అవినాష్‌ నే ముందు ఉంచుతున్నారు. తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు మరియు కార్యకర్తలను వైకాపా వైపు లాగడంలో దేవినేని అవినాష్‌ క్రియాశీలకంగా పని చేసే అవకాశం ఉంది. అందుకే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృష్ణా జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవినాష్‌ ను వాడేస్తున్నాడు అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి